టెర్రరిస్టుల టార్గెట్ దసరా : దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, ఆలయాల్లో హైఅలర్ట్

ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 04:06 AM IST
టెర్రరిస్టుల టార్గెట్ దసరా : దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, ఆలయాల్లో హైఅలర్ట్

Updated On : September 18, 2019 / 4:06 AM IST

ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని

ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని హెచ్చరించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చాయి. ఉగ్రదాడుల ముప్పు ఉందంటూ హరియానా పోలీసులకు సమాచారం అందడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో, రైళ్లలో భద్రతను భారీగా పెంచింది. కీలకమైన రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ నుంచి వచ్చిన హెచ్చరికలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రైల్వేస్టేషన్ల ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాహనాలను కూడా చెక్ చేస్తున్నారు. రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ దళాలు జాయింట్ గా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రైల్వే స్టేషన్లే లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులకు పాల్పడే అవకాశముందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. జైషే మహమ్మద్ కు చెందిన మసూద్ అహ్మద్ పేరుతో ఇటీవలే రోహ్ తక్ లోని రైల్వే పోలీసులకు ఓ లేఖ అందింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, ఆలయాల్లో అక్టోబర్ 8న దాడులు జరగనున్నాయని ఆ లేఖలో ఉంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, యూపీ, హర్యానాలోని దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆలయాల్లోనూ భద్రత పెంచారు.