నిజమేనా : ఏడు పడగల పాము కుబుసం..పూజలు

పాల సముద్రంలో విష్ణుమూర్తి పవళించే ఆది శేషుడికి ఏఢు తలలు ఉంటాయని పురాణ కథల్లో చదువుకున్నాం.

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 06:43 AM IST
నిజమేనా : ఏడు పడగల పాము కుబుసం..పూజలు

Updated On : May 8, 2019 / 6:43 AM IST

పాల సముద్రంలో విష్ణుమూర్తి పవళించే ఆది శేషుడికి ఏఢు తలలు ఉంటాయని పురాణ కథల్లో చదువుకున్నాం.

బెంగళూరు : పాల సముద్రంలో విష్ణుమూర్తి పవళించే ఆది శేషుడికి ఏఢు తలలు ఉంటాయని పురాణ కథల్లో చదువుకున్నాం. సినిమాలలో చూస్తుంటాం. వాస్తవంగా 7 తలల పాము కనిపించిన ఘటనలు లేవనే చెప్పాలి. ఏడు తలల పాము కుబుసం ఒకటి వైరల్ గా మారింది.

నిజానికి ఏడు పడగల పాము ఉందా. అంటే లేదని కచ్చితంగా చెప్పలేము.. కానీ ఏడు తలల పాము విడిచిన కుబుసం ఒకటి (పాములు విడిచే పొర) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా కనకపుర తాలూకా కోడిహళ్లి సమీపంలో ఏడు పడగల పాముకి చెందినదిగా (అనుకుంటున్న) పాము పొర (కుబుసం) ఒకటి చర్చకు దారితీసింది.

ఏడు తలల పాముని చూశామంటూ కొన్ని నెలల క్రితం కన్నడనాట విస్తృతమైన ప్రచారం జరిగింది. ఇప్పుడు రామనగర్ జిల్లా కోడిహళ్లిలో ఏడు తలల పాము కుబుసం సంచలనంగా మారింది. ఈ కుబుసాన్ని నాగ దేవతగా భావించి స్థానికులు పూజలు కూడా చేసేస్తున్నారు. ఈ కుబుసానికి సమీపంలోనే ఓ పాము పుట్టకూడా ఉండటంతో ఇది కచ్చితంగా నాగ దేవతే అని నమ్ముతూ పూజలు చేస్తున్నారు స్థానికులు.