యూఎస్ లో ఇండియా గాంధీ పాపులారిటీ చూడండి..థరూర్ బ్లండర్స్ పై నెటిజన్ల సెటైర్లు

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2019 / 01:08 PM IST
యూఎస్ లో ఇండియా గాంధీ పాపులారిటీ చూడండి..థరూర్ బ్లండర్స్ పై నెటిజన్ల సెటైర్లు

Updated On : September 24, 2019 / 1:08 PM IST

సీనియర్ కాంగ్రెస్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా పేరుపొందిన థరూర్ అప్పుడప్పుడూ తన ట్వీట్లతో నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి నుంచి ట్రోల్ ని కూడా ఎదుర్కొంటుంటారు. 

ఆదివారం(సెప్టెంబర్-2019)హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరై వేలాదిమంది ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరైన ఈ కార్యక్రమానికి 59వేల మంది హాజరయ్యారు. 

అయితే విదేశాల్లో మోడీకున్న పాపులారిటీ గత భారతదేశ ప్రధానులకెవరికీ లేదని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలకు కౌంటర్ ఇచ్చేందుకు థరూర్ ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్లలో ఆయన.. ఓ పెద్ద పొరబాటే చేశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘ఇండియా గాంధీ‘ గా తెలిపారు. పైగా తన సహచరులకు తప్పుడు సమాచారమిచ్చారు. ప్రత్యేక పీఆర్ క్యాంపెయిన్ గానీ,ఎన్ఆర్ఐ క్రౌడ్ మేనేజ్ మెంట్ గానీ, మీడియా పబ్లిసిటీ, హైప్ లేకుండానే 1954లో అమెరికాలో జరిగిన పబ్లిక్ ర్యాలీలో జవహర్లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ పాల్గొన్నప్పుడు అశేష జనం వచ్చారని అంటూ థరూర్ ఓ ఫొటోను షేర్ చేశారు. కొద్ది సేపటికే ఆ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. విపరీతంగా వైరల్ అయింది.

అయితే అది అమెరికాలో జరిగినప్పటి ర్యాలీ కాదని, ఆ సంవత్సరం కూడా తప్పని తేలింది. 1956 లో మాస్కోలో జరిగిన ర్యాలీలో నెహ్రు, ఇందిర పాల్గొన్నప్పటి ఫోటో ఇది.. మీరు పూర్తిగా సీన్ మార్చేశారని అంటూ ఆర్.జగన్నాథన్ అనే జర్నలిస్టు తన ట్వీట్లో తెలిపారు. కానీ ఈ జర్నలిస్టు చెప్పిన సంవత్సరం కూడా తప్పేనట. 1955 లో నెహ్రు, ఇందిర రష్యాలోని మాగ్నిటోగోర్స్ అనే పట్టణాన్ని విజిట్ చేసినప్పటి ఫోటో ఇదని ఆ తరువాత తెలిసింది. శశిథరూర్ గారి బ్లండర్స్ నెటిజన్స్ సెటైర్లు వేశారు. ఏదో చేద్దామనకుంటే ఏదో అయ్యిందే అంటూ థరూర్ పై నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీంతో థరూర్ మరో ట్వీట్ చేశారు. మోడీకిలానే విదేశాల్లో గత భారత ప్రధానులకు కూడా పాపులారిటీ ఉందన్నది నిజం అని,ఆ ఫొటో అప్పటి సోవియట్ యూనియన్ లోనిదని,యూఎస్ ది కాదని తెలిపారు.