శశిథరూర్ కు సాహిత్య అకాడమీ అవార్డు

కాంగ్రెస్ సీనియర్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిధరూర్ కు ఇంగ్లీష్ బాషలో 2019 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. బుధవారం(డిసెంబర్-18,2019)సాహిత్య అకాడమీ 23బాషల్లో సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించగా ఇంగ్లీషు భాషలో ఏన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్(చీకటి యుగం) అనే పుస్తకానికి గాను శశిథరూర్ ను ఈ అవార్డు వరించింది.
భారత్ పై బ్రిటీష్ పాలన ప్రభావాన్ని శశిథరూర్ పుస్తకంలో వివరించారు. 2016లో అప్పటి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ చేత ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం పట్ల శశిధరూర్ ఆనందం వ్యక్తం చేశారు.