సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన శివసేన

మరాఠా రాజకీయాలు ట్విస్టింగ్‌ల మీద ట్విస్టింగ్‌లు ఇస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడం కోసం శివసేన గడువు కోరగా అందుకు తిరస్కరించిన గవర్నర్ ప్రెసిడెంట్ రూల్‌కు సిఫార్సు చేసింది.
ప్రభుత్వ ఏర్పాటుపై వైఖరి తెలియజేసేందుకు బీజేపీకి మూడు రోజుల గడువు ఇచ్చిన గవర్నర్.. తమకు మాత్రం 24 గంటలు మాత్రమే ఇవ్వడం కరెక్ట్ కాదని శివసేన అంటుంది. మద్దతు కూడగట్టుకునేందుకు మరింత సమయం ఇవ్వాలంటూ గవర్నర్‌ను కోరినా అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌సీపీ, కాంగ్రెస్ మద్దతు కోసం శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని, సరిపడా సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడగట్టడానికి మూడు రోజుల గడువు కావాలని శివసేన.. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని అభ్యర్థించింది. అయితే అందుకు గవర్నర్ ఒప్పుకోకుండా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు.