Customer Assaults Bank Manager : ట్యాక్స్ డిడక్షన్ వివాదం.. బ్యాంకు మేనేజర్‌పై కస్టమర్ దాడి.. వీడియో వైరల్

ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది.

Customer Assaults Bank Manager : ట్యాక్స్ డిడక్షన్ వివాదం.. బ్యాంకు మేనేజర్‌పై కస్టమర్ దాడి.. వీడియో వైరల్

Customer Assaults Bank Manager (Photo Credit : Google)

Updated On : December 8, 2024 / 9:26 PM IST

Customer Assaults Bank Manager : అహ్మదాబాద్ లోని యూనియన్ బ్యాంకులో రచ్చ రచ్చ జరిగింది. ఓ వివాదం బ్యాంకు మేనేజర్, కస్టమర్ కొట్టుకునే వరకు వెళ్లింది. కోపంతో ఊగిపోయిన కస్టమర్ బ్యాంకు మేనేజర్ పై దాడి చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవతో బ్యాంకులో ఒక్కసారిగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ గా మారింది.

జైమన్ రావల్ అనే వ్యక్తికి యూనియన్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్ పై ఎక్కువ ట్యాక్స్ డిడక్షన్(టీడీఎస్) అయ్యింది. దీంతో కస్టమర్ జైమన్.. ఈ విషయమై అడిగేందుకు బ్రాంచ్ కి వెళ్లాడు. ఎందుకు ఇలా జరిగిందని బ్యాంకు మేనేజర్ ని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. కోపంతో ఊగిపోయిన కస్టమర్ బ్యాంకు మేనేజర్ పై దాడి చేశాడు. బ్యాంకు మేనేజర్ ను అతడు కొట్టాడు. ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్ సైతం ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ కస్టమర్ మాత్రం మరింత రెచ్చిపోయాడు. బ్యాంకు మేనేజర్ పై చేయి చేసుకున్నాడు.

ఈ ఘటనతో అక్కడే ఉన్న బ్యాంకు సిబ్బంది షాక్ కి గురయ్యారు. వెంటనే తేరుకుని ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశారు. చివరికి బ్యాంకు మేనేజర్ ని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఇంతలో కస్టమర్.. మరో బ్యాంకు ఉద్యోగిపై దాడికి యత్నించడం కలకలం రేపింది. బ్యాంకు మేనేజర్ పై కస్టమర్ దాడికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలా భౌతికంగా దాడులకు దిగితే తాము డ్యూటీ చేసేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, ఇలా దాడులు చేయడం ఏంటని సీరియస్ అవుతున్నారు. బ్యాంకు మేనేజర్, కస్టమర్ మధ్య గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Also Read : ప్యాంటు జేబులో పేలిన మొబైల్ ఫోన్.. స్కూల్ ప్రిన్సిపల్ మృతి..