Delhi : OMG.. రోడ్డుపై రెచ్చిపోయిన ఎద్దు, బైక్‌పై వెళ్తున్న తల్లీకొడుకులపై దాడి, కుమ్మి కుమ్మి పడేసింది.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో
ఎంతమంది వచ్చినా ఎద్దు మాత్రం బెదరలేదు. బైక్ పై ఉన్న వారిని కుమ్మి కుమ్మి వదిలింది. Delhi Bull Attack

Delhi Bull Attack(Photo : Google)
Delhi Bull Attack : వీధుల్లో ఉండే పశువులు రెచ్చిపోతున్నాయి. నడిరోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉన్నట్టుండి దాడులకు తెగబడుతున్నాయి. ఇన్నాళ్లు కుక్కల స్వైర విహారం చూశాము. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కల దాడి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే చాలు.. శునకాలు పిచ్చి కుక్కలా మీదకు వస్తున్నాయి. కొరికి కొరికి చంపేస్తున్నాయి.
ఇప్పుడు ఆ కోవలోకి ఎద్దు చేరింది. నడిరోడ్డుపై ఎద్దులు రెచ్చిపోతున్నాయి. సడెన్ గా అటాక్ చేస్తున్నాయి. కొమ్ములతో కుమ్మి పడేస్తున్నాయి. వాడైన కొమ్ములతో ఎత్తి ఎత్తి మరీ కుమ్ముతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ ఎద్దు రెచ్చిపోయింది. బైక్ పై వెళ్తున్న తల్లీ కొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
Also Read..Students Romance : ఛీ..ఛీ.. కాలేజీలోనే లవర్స్ పాడు పని, అంతా చూస్తుండగానే.. వీడియో వైరల్
అది ఈస్ట్ ఢిల్లీలోని గీతా కాలనీ ఏరియా. ఆ రోడ్డు బిజీగా ఉంది. వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతలో ఓ బైక్ పై తల్లి, కొడుకు వచ్చారు. వారికి రోడ్డుపై ఎద్దు కనిపించింది. దీంతో ఆమె బైక్ ను స్లో చేసింది. ఎద్దు వెళ్లిపోయాక ముందుకెళ్లొచ్చని భావించింది. కానీ, దారుణం జరిగింది. ఊహించని విధంగా సడెన్ గా ఎద్దు వారిపై దాడికి దిగింది. కొమ్ములతో కుమ్మింది. ఈ దాడిలో బైక్ పై నుంచి తల్లీ కొడుకులు రోడ్డు మీదకు పడిపోయారు. బైక్ కూడా పడిపోయింది. ఎద్దు వారిని కుమ్మడం స్టార్ట్ చేసింది.
ఇది గమనించిన ఇతర వాహనదారులు, స్థానికులు వెంటనే అక్కడికి వచ్చారు. ఎద్దుని తరిమికొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రాళ్లు, కర్రలతో దాన్ని తరమాలని చూశారు. కానీ, ఎద్దు అదరలేదు బెదరలేదు. దాడి ఆపలేదు. మహిళను ఆమె కొడుకుని కుమ్ముతూనే ఉంది. అడ్డుకోబోయిన స్థానికులపైనా దాడి చేసింది. అలా కాసేపు ఎద్దు బీభత్సం కొనసాగించింది. చివరికి అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎద్దు దాడిలో ఆ ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఎద్దు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతమంది వచ్చినా ఎద్దు మాత్రం బెదరలేదు. బైక్ పై ఉన్న వారిని కుమ్మి కుమ్మి వదిలింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఎక్కడ చూసినా వీధుల్లో పశువులు విచ్చలవిడిగా తిరుగుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇలా పశువులు విచ్చలవిడిగా రోడ్డు మీద తిరక్కుండా, దాడులకు పాల్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
#WatchVideo: Delhi: CCTV visuals of bull attack that took place in Geeta Colony on 21st July pic.twitter.com/NJ6N4SGfkI
— The National Bulletin (@TheNationalBul1) July 22, 2023