Crocodile : ఇదెక్కడి విడ్డూరం రా మావా.. మొసలిని పేరుతో పిలిచి ఆహారం తినిపించడమే కాదు తలపై నిమిరాడు కూడా.. షాకింగ్ వీడియో

అంతకుమించి షాకింగ్ ఏంటే.. అతడు దాన్ని పేరు పెట్టి పిలవడం, అతడి గొంతు విని రావడం మరింత విస్మయానికి గురి చేస్తుంది. Crocodile Feeding

Crocodile : ఇదెక్కడి విడ్డూరం రా మావా.. మొసలిని పేరుతో పిలిచి ఆహారం తినిపించడమే కాదు తలపై నిమిరాడు కూడా.. షాకింగ్ వీడియో

Crocodile Feeding (Photo : Google)

Crocodile Feeding : భారీ ఆకారంతో ఉండే మొసలిని దూరం నుంచి చూస్తేనే భయంతో కాళ్లు చేతులు వణుకుతాయి. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. అలాంటిది మొసలి దగ్గరగా వెళ్లి దానికి ఆహారం తినిపించడం అంటే మాటలా? అంతకుమించి దాని తల మీద నిమరడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే.

మీ సంగతి, నా సంగతి అటుంచితే.. ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యక్తి గుండె ధైర్యానికి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అతడి గట్స్ ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా.. స్వయంగా మొసలికి ఆహారం తినిపించాడు. అంతేనా, దాని తల మీద పలుమార్లు నిమిరాడు కూడా. అంతకుమించి షాకింగ్ ఏంటే.. అతడు దాన్ని మనిషిని పిలిచినట్లు పేరు పెట్టి పిలవడం, అతడి గొంతు విని ఆ మొసలి రావడం మరింత విస్మయానికి గురి చేస్తుంది.

అది గుజరాత్ రాష్ట్రం గిర్ సోమనాథ్​ జిల్లా. అక్కడ ఓ షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ హిరాన్​ నది ఒడ్డున ఉన్న ఖోడియార్ ఆలయ సమీపంలో జీవా భగత్ అనే వ్యక్తి నీళ్లలో ఉన్న మొసలికి ఆహారం తినిపించాడు. అనంతరం మొసలి తలపై పలుమార్లు నిమిరాడు. ఆ వ్యక్తి ఇలా చేస్తుండగా ఎవరో వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Crocodile Feeding)

Also Read..Viral Video : ఛీ..ఛీ.. యూనివర్సిటీ క్యాంటీన్‌లో దారుణం, కాళ్లతో తొక్కుతూ ఆహారం తయారీ.. షాకింగ్ వీడియో

ఇందులో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. జీవా భగత్.. మొసలిని పేరు పెట్టి పిలవడం. నది ఒడ్డున నిల్చుని షీతల్ షీతల్ అని పిలిచాడు. గమ్మత్తుగా అతడి వాయిస్ విన్న మొసలి.. తనను ఎవరో పేరు పెట్టి పిలిచినట్లు.. నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. ఒడ్డుకు రాగానే జీవా భగత్ దానికి ఆహారం తినిపించాడు. ప్లేట్ లో ఉన్న ఆహారం అంతా దానికి పెట్టాడు. చివరలో దాని తలమీద మూడుసార్లు నిమిరాడు. జై మాతాజీ అంటూ దాని తలపై అతడు నిమరడం వీడియోలో ఉంది. తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్కతోనో, పిల్లితోనో మాట్లాడినట్లుగా.. ఆ వ్యక్తి మొసలితో మాట్లాడటం అందరినీ నివ్వెరపోయేలా చేసింది.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొసలిని పేరు పెట్టి పిలవడం దానికి ఆహారం పెట్టడం తల మీద నిమరడం.. అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇదెక్కడి విడ్డూరం రా మావా అని నివ్వెరపోతున్నారు. ఆ వ్యక్తి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం రా మావా అని నెటిజన్లు విస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి వింత చూడలేదంటున్నారు.(Crocodile Feeding)

Also Read..Viral Video: గర్భంతో ఉన్న నల్లజాతీయురాలిని కాల్చి చంపిన పోలీసు.. ఎందుకంటే?

నిజానికి అతడు మొసలికి చాలా దగ్గరగా ఉన్నాడు. మొసలి అనుకుంటే అతడిపై దాడి చేయొచ్చు. కానీ, మొసలి అలా చేయకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. నిజం చెప్పాలంటే ఆ వ్యక్తి చాలా రిస్క్ చేశాడు. ప్రాణాలతో చెలగాటం ఆడాడు. ఏ మాత్రం తేడా వచ్చినా అతడు నీటిలో పడిపోయే ప్రమాదం, మొసలి దాడి చేసి చంపే ప్రమాదం ఎక్కువగా ఉంది. కానీ, అతడు భయపడలేదు. తన ఇంట్లో పెంపుడు జంతువుతో మెలిగినట్టే.. ఆ క్రూరమైన మొసలితో మెలిగాడు. ఈ వీడియో చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.(Crocodile Feeding)

నిజానికి.. మొసళ్లు షెడ్యూల్-I రక్షిత జంతువులు. ఈ విధంగా వాటికి ఆహారం ఇవ్వడం చట్టరిత్యా నేరం. ఇక సెంట్రల్ గుజరాత్‌లోని వడోదర నగరం విశ్వామిత్ర నది మొసళ్ల నిలయంగా మారింది. అందులో 300 కంటే ఎక్కువ మొసళ్లు ఉన్నాయి.