AAP ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు, ఒకరు మృతి

AAP ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు, ఒకరు మృతి

Updated On : February 12, 2020 / 1:28 AM IST

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుంది ఆప్. ఫలితాలు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌పై కాల్పులు జరిపారు. బుధవారం జరిగిన ఘటనలో ఒక వాలంటీరు చనిపోయినట్లు ఆప్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. విజయం తర్వాత గుడికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తు సంభవించినట్లు ఆప్ పేర్కొంది.

‘ఈ ఘటన నిజంగా దురదృష్టకరం. దాడి వెనుక కారణం తెలియలేదు. అకస్మాత్తుగా జరిగింది. నాలుగు రౌండ్ల ఫైరింగ్ జరిగింది. నేను ఉన్న వాహనంపైనా దాడి జరిగింది. పోలీసులు దాడి చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. వాళ్లు పట్టుకుంటారని ఆశిస్తున్నాను’ అని నరేశ్ యాదవ్ ఇంగ్లీష్ మీడియాతో చెప్పారు. 

కిషన్‌ఘర్ ప్రాంతం దాటుతుండగా ఫైరింగ్ జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. మెహ్రౌలీలో ఉన్న ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. మెహ్రైలీ అసెంబ్లీ సీటుకు పోటీ చేసిన నరేశ్ యాదవ్ అద్భుతమైన మెజార్జీతో గెలిచారు. బుధవారం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. ఆప్ 62స్థానాలు గెలుచుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అక్కడ గ్యాంగ్ వార్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒకరు మరణించినట్లు తెలుస్తుంది.