Sikkim flash floods: సిక్కిం వరదల్లో 56కు పెరిగిన మృతుల సంఖ్య, 26 మృతదేహాలు లభ్యం
సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 56 కు పెరిగింది. సిక్కిం విపత్తు కారణంగా ఇప్పటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30 మృతదేహాలు లభ్యమయ్యాయి....

Sikkim flash floods
Sikkim flash floods: సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 56 కు పెరిగింది. సిక్కిం విపత్తు కారణంగా ఇప్పటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. అక్టోబర్ 4వతేదీన నార్త్ సిక్కింలోని లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ తో తీస్తా నదిలో నీటిమట్టం పెరగడంతో 8 మంది ఆర్మీ సిబ్బందితో సహా 56 మంది మరణించారు. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది.
Read Also :Israel : ఇజ్రాయెల్ స్డెరోట్ పట్టణ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు
గల్లంతైన వారి కోసం తీస్తా ప్రవహించే పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగుతోంది. సింగ్టామ్ సమీపంలోని బుర్దాంగ్ వద్ద పార్క్ చేసిన 39 వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ఇండియన్ ఆర్మీ మరియు ఇతర ఏజెన్సీలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉత్తర సిక్కింలోని లాచుంగ్, లాచెన్ లోయల్లో 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఉపగ్రహ టెర్మినల్స్ ద్వారా ఆహారం, వైద్య సహాయం, టెలిఫోన్ కనెక్టివిటీని అందించారు. సైన్యం ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను కూడా ఏర్పాటు చేసింది.
Read Also : Earthquakes : అప్ఘానిస్థాన్‌లో 8 సార్లు భూ ప్రకంపనలు…320 మంది మృతి