Ooty : ఊటీలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన భ‌వ‌నం.. ఆరుగురు మ‌హిళా కార్మికులు మృతి

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ఊటీలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మ‌హిళా కార్మికులు మ‌ర‌ణించారు.

Ooty : ఊటీలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన భ‌వ‌నం.. ఆరుగురు మ‌హిళా కార్మికులు మృతి

Six die after portion of building collapses in Lovedale near Ooty

Updated On : February 7, 2024 / 3:10 PM IST

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ఊటీలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మ‌హిళా కార్మికులు మ‌ర‌ణించారు.

ఊటీకి స‌మీపంలోని లవ్‌డేల్ ప్రాంతంలో ఓ పాత భ‌వ‌నాన్ని పున‌రుద్ద‌రించే ప‌నుల‌ను చేప‌ట్టారు. దాదాపు 13 మంది కార్మికులు ఈ ప‌నుల్లో నిమ‌గ్న‌మై ఉన్నారు. వారు మ‌ట్టి ప‌ని చేస్తుండ‌గా భ‌వనంలోని కొంత భాగం కూలిపోయింది. శిథిలాల కింద ప‌లువురు కార్మికులు చిక్కుకున్నారు. కార్మికుల అరుపులు విన్న‌చుట్టుప‌క్క‌ల వారు వెంట‌నే పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది.. ఈసారి 40 సీట్లు కూడా రావు: ప్రధాని మోదీ

స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించింది. న‌లుగురు కార్మికుల‌ను ర‌క్షించారు. వీరికి గాయాలు కావ‌డంతో వెంట‌నే స‌మీపంలోని ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌రో ఆరుగురు మ‌హిళ‌లు మృతి చెందారు. మృతుల‌ను సంగీత (35), షకీల (30), భాగ్య (36), ఉమ (35), ముత్తులక్ష్మి (36), రాధ (38)గా గుర్తించారు. మృతులంతా ఉతగై గాంధీనగర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

కాగా.. మ‌రో కార్మికుడు గ‌ల్లంతైన‌ట్లు తెలుస్తోంది. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.