Electric Shock : విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం

అప్పటివరకు కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విగతజీవులుగా మారిపోయారు.

Electric Shock : విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం

Electrocution

Updated On : July 11, 2021 / 9:52 PM IST

Electric Shock : అప్పటివరకు కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విగతజీవులుగా మారిపోయారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్‌పూర్ జిల్లా బిజావ‌ర్ ఏరియాలోని ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరు కలిసి వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేస్తున్నారు.

అందులో ఉండే నీటిని తోడేందుకు విద్యుత్ మోటర్ ని బిగించారు. ట్యాంక్ లోని నీటిని ఖాళీ చేస్తుండగా ఒకరికి కరెంట్ షాక్ తగిలింది. అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తికి షాక్ తగలడంతో మృతి చెందాడు. ఆలా ఒకరి తర్వాత ఒకరు కాపాడేందుకు వెళ్లి షాక్ కి గురయ్యారు. నిమిషాల్లోనే ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు.

అప్పటి వరకు తమ మధ్య తిరిగిన వ్యక్తులు మృతి చెందటంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృత‌దేహాలను పోస్టుమార్టానికి త‌ర‌లించారు.