వామ్మో.. కాకి తెలివి చూడండి

ఓ కాకి..నల్లా దగ్గరకు వచ్చి ఆగింది. అమాంతం..నల్లా పైకి ఎక్కింది. నల్లాను ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది.

వామ్మో.. కాకి తెలివి చూడండి

Thirsty Crow

Updated On : March 26, 2021 / 3:26 PM IST

Skilled crow Thirsty Crow Video Viral: : కాకి పిల్ల కాకికి ముద్దు, కాకి ముక్కుకు దొండ పండు..ఇలాంటి ఎన్నో సామెతలున్నాయి. కాకమ్మ కబుర్లు..ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే..ఇదిలా ఉంటే..ఓ కాకి తెలివి చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. Susanta Nanda IFS ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన రిలీజ్ చేసిన ట్వీట్ లో కాకి నీళ్లు తాగుతోంది. అందులో విశేషం ఏముంది. అని అనుకుంటున్నారా ?

కాకి..కుండ కథ అందరికీ తెలిసిందే. కుండలో నీళ్లు కిందకు ఉండేసరికి..రాళ్లను తెచ్చి అందులో వేయసాగింది. నీళ్లు పైకి రాగానే..తన దప్పిక తీర్చేసుకుంది. కానీ..ఈ కాకి మాత్రం ఏకంగా..నల్లా తిప్పేసుకుని గట గటా తాగేసింది. Susanta Nanda IFS అధికారి..ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ఓ కాకి..నల్లా దగ్గరకు వచ్చి ఆగింది. అమాంతం..నల్లా పైకి ఎక్కింది. నల్లాను ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. తన ముక్కుతో కొట్టింది. గట్టిగా కొట్టే వరకు..నల్లా ఓపెన్ అయ్యింది. వస్తున్న నీళ్లను తాగి తన దప్పికను తీర్చేసుకుంది. చివరిలో మాత్రం నల్లాను ఆపిందా ? లేదా అనేది క్లారిటీ లేదు. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో వెల్లడించలేదు.