Small Cars : చిన్న కార్లలో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ పెట్టండి – నితిన్ గడ్కరీ

దేశంలో చిన్నకార్లను నడిపేవారిలో అధికంగా పేదవారే ఉంటారు. ప్రమాదానికి గురైనప్పుడు ఈ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.

Small Cars : చిన్న కార్లలో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ పెట్టండి – నితిన్ గడ్కరీ

Small Cars

Updated On : September 21, 2021 / 3:01 PM IST

Small Cars : దేశంలో కార్ల అమ్మకాలు ఏటికేడు పెరుగుతున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు కూడా కార్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ స్తోమతకు తగినట్లు తక్కువ ధరకు వచ్చే కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ చిన్న కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉండటం లేదు. ఒకవేళ ప్రమాదానికి గురైతే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్లలో చిన్న కార్లలో ప్రయాణిస్తున్నవారే అధికంగా ఉన్నారు. కార్లో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా మృతి చెందుతున్నారు.

Read More : Honda Cars : హోండా కార్లపై బంపర్ ఆఫర్లు…పూర్తి వివరాలు

ఖరీదైన కార్లలో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఖరీదైన కార్లు ధనవంతులే కొంటారు. ఈ కార్లకు ప్రమాదం జరిగిన చిన్న చితక గాయాలతో ప్రాణాలతో బయటపడతారు. అయితే చిన్న కార్ల విషయంలో ఆలా ఉండదు. ఆలా పేదల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా చిన్న కార్లలో కూడా కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండేలా కార్ల కంపెనీలు చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు.

Read More : Car Prices Hike : కారు కొంటున్నారా? ధ‌ర‌లు పెరుగుతున్నాయట.. వెంటనే కొనేసుకోండి!

తాజాగా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన ఆయన ఎంట్రీ లెవల్ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఉండవని ప్రశ్నించారు. మన దేశంలో రోడ్ల మీదకు వచ్చే ప్రతి కారులో ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని స్పష్టం చేశారు. మన దేశంలో పేదలు, మధ్య తరగతి ప్రజలే చిన్న కార్లను కొనుగోలు చేస్తారు. ఆ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే.. రోడ్డు ప్రమాదాల్లో వాళ్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది కదా. అందుకే.. ఖచ్చితంగా అన్ని కార్లో ఆటోమొబైల్ కంపెనీలు.. కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేయాల్సిందే” అని ఆయన తెలిపారు.