Honda Cars : హోండా కార్లపై బంపర్ ఆఫర్లు…పూర్తి వివరాలు

హోండా కార్ ఇండియా’ రూ. 57 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. సెప్టెంబర్ 30 లేదా స్టాక్ పూర్తయ్యే వరకు అందించనున్నారని తెలుస్తోంది.

Honda Cars : హోండా కార్లపై బంపర్ ఆఫర్లు…పూర్తి వివరాలు

Car

Honda Cars : పండుగల సీజన్ వచ్చేస్తోంది. ఈ పండుగల సీజన్ ను క్యాష్ చేసుకోవాలని వివిధ కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పోటాపోటీగా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కొత్త వాహనాలు తీసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపుతుంటారు.

Read More : Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధర

దీంతో అమ్మకాలు అధికంగా నమోదవుతుంటాయి. దీంతో కస్టమర్లను ఆకట్టుకొనేందుకు వ్యాపారసంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో ‘హోండా కార్ ఇండియా’ రూ. 57 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ప్రయోజనాలను సెప్టెంబర్ 30 లేదా స్టాక్ పూర్తయ్యే వరకు అందించనున్నారని తెలుస్తోంది.

Read More : Gold Mafia : బెజవాడలో బంగారం చాలా చౌక…!

 

Honda City

హోండా సిటీపై :-

హోండా సిటీ సెడాన్ పై మొత్తం రూ. 37 వేల 708 విలువ చేసే ప్రయోజనాలు కల్పిస్తున్నారు. రూ. 10 వేల నగదు రాయితీ, రూ. 10 వేల 708 విలువ చేసే యాక్సెసరీలు ఇస్తున్నారు. కారు ఎక్స్చేంజ్ పై రూ. 5 వేల వరకు రాయితీ, లాయల్టీ బోనస్ కింద రూ. 5 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 8 వేలు..హోండా కారు ఎక్స్చేంజ్ పై రూ. 9 వేల వంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారు.

Read More : Cheating Gang Arrest : ఏటీఎం కార్డుల ద్వారా బ్యాంకులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

Honda Jazz

హోండా జాజ్ పై :-

హోండా జాజ్ పై కూడా పలు ప్రయోజనాలు కల్పిస్తోంది. రూ. 39 వేల 947 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. నగదు రాయితీ కింద రూ. 10 వేలు లేదా రూ. 11 వేల 947 యాక్సెసరీస్ పొందవచ్చు. కారు ఎక్స్చేంజ్ చేస్తే…రూ. 10 వేల వరకు రాయితీ కల్పిస్తున్నారు. లాయల్టీ       బోనస్ రూ. 5 వేలు, కార్పొరేట్ బోనస్ కింద రూ. 4 వేలు, హోండా కారు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ. 9 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నారు.

Read More : Aadhaar Card : ఇకపై ఆధార్ కార్డులో తండ్రి, భర్త పేరు ఉండదు

Honda Amaze

హోండా అమేజ్ :-

హోండా అమేజ్ ప్రి – ఫేస్ లిప్ట్ పై గరిష్టంగా…రూ. 57 వేల 044 వరకు రాయితీ అందించనున్నారు. ఎస్ఎంటీ (SMT) పెట్రోల్ ట్రిమ్ పై రూ. 20 వేలు నగదు రాయితీ లేదా రూ. 24 వేల 044 విలువ చేసే ఎఫ్ఓసీ (FOC) యాక్సెసరీస్ ఇస్తున్నారు. కారు ఎక్స్చేంజీ చేస్తే..మరో రూ. 15 వేల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. వీ ఎంటీ, ఎంటీ గ్రేడ్ కార్లపై రూ. 5 వేలు వరకు నగదు రాయితీ లేదా రూ. 5 వేల 998 విలువ చేసే ఎఫ్ఓసీ (FOC) యాక్సెసరీస్ ఇస్తున్నారు. కారు ఎక్స్చేంజ్ చేస్తే…రూ. 10 వేల వరకు పొందవచ్చు. లాయల్టీ బోన్ కింద రూ. 5 వేల వరకు, సంబ్ కాంపాక్ట్ సెడాన్ పై మరో రూ. 4 వేల రాయితీ పొందే అవకాశం ఉంది.

Read More : IT Refund : 24లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రీఫండ్.. ఆన్‌లైన్‌లో స్టేటస్ ఇలా తెలుసుకోండి

Honda Wrv

హోండా డబ్ల్యూఆర్ వీపై :-

హోండా డబ్ల్యార్ వీపై గరిష్టంగా రూ. 39 వేల 998 ప్రయోజనాలు పొందవచ్చు. నగదు రాయితీ కింద రూ. 10 వేలు లేదా రూ. 11 వేల 998 విలువ చేసే యాక్సెసరీస్, కారు ఎక్స్చేంజ్ పై రూ. 10 వేలు పొందవచ్చు. లాయల్టీ బోనస్ కింద రూ. 5 వేలు, కార్పొరేట్ బోనస్ రూ. 4 వేలు…హోండా కారు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ. 9 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది.