Smriti Irani: స్మృతీ ఇరానీ కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే.. – అధిర్

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అనే కామెంట్లు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆదివారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ద్రౌపది ముర్ము అనే పేరును ఏకవచనంతో సంభోదించారని ముందు ప్రెసిడెంట్ అనే పదం వాడలేదని ఆరోపించారు. ఈ మేరకు ఆమె క్షమాపణ చెప్పి తీరాలని అన్నారు.

Smriti Irani: స్మృతీ ఇరానీ కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే.. – అధిర్

Smriti Irani

 

 

Smriti Irani: ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అనే కామెంట్లు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆదివారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ద్రౌపది ముర్ము అనే పేరును ఏకవచనంతో సంభోదించారని ముందు ప్రెసిడెంట్ అనే పదం వాడలేదని ఆరోపించారు. ఈ మేరకు ఆమె క్షమాపణ చెప్పి తీరాలని అన్నారు.

కొద్ది రోజుల క్రితం రాష్ట్రపత్ని అనే పదం వాడి బీజేపీ విమర్శలు ఎదుర్కొన్న రంజన్.. తాను హిందీలో అంతగా ప్రావీణ్యం లేని వాడినని నోరుజారానని వివరణ ఇచ్చుకున్నాడు. కాకపోతే అదే సమయంలో చౌదరితో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది బీజేపీ.

లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో “మా అధ్యక్షురాలు పేరును అవసరమైన, అనవసరమైన వివాదంలోకి లాగారని అనుకుంటున్నాను. రాష్ట్రపతిని కామెంట్ చేయడం అనుకోకుండా ఈ పొరపాటు జరిగింది. నాకు హిందీ బాగా రాదు. నేను చేసిన తప్పుకు చింతిస్తున్నాను. రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాను”

Read Also: స్మృతీ ఇరానీతో సోనియా.. “నాతో మాట్లాడకు”

స్మృతి ఇరానీ సభలో రాష్ట్రపతి పేరును తీసుకోవడం సరికాదని, రాష్ట్రపతి హోదా, హోదాకు అనుగుణంగా ప్రవర్తించలేదని ఎత్తిచూపారు.

“స్మృతి ఇరానీ ‘ద్రౌపది ముర్ము’ అని పదే పదే అరుస్తోంది. రాష్ట్రపతి పేరు ముందు ప్రెసిడెంట్ లేదా మేడం లేదా శ్రీమతి అని ప్రిఫిక్స్ చేయలేదు. ఇది స్పష్టంగా రాష్ట్రపతి పదవి స్థాయిని దిగజార్చడమే అవుతుంది. కాబట్టి స్మృతి ఇరానీ తన అగౌరవ వ్యాఖ్యలు, గౌరవాన్ని తగ్గించినందుకు రాష్ట్రపతికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా” అని చౌదరి లేఖలో పేర్కొన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ రమా దేవితో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు మాట్లాడుతుండగా కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవడంతో సోనియా గాంధీ.. స్మృతి ఇరానీపై అరిచారని బీజేపీ పేర్కొంది.

గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సహా బీజేపీ ఎంపీలు చౌదరి వ్యాఖ్యలపై పార్లమెంటులో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.