ఏం గుండెరా ఆమెది..! పక్కనే విషపూరితమైన పామున్నా ఎంత ధైర్యంగా నిల్చుందో చూడండి..
అంతే, ఒక్కసారిగా కలకలం రేగింది. పాము రాకను గమనించిన మహిళలు భయంతో కేకలు వేశారు. వెంటనే నీటిలో నుంచి గట్టు మీదకు వచ్చేశారు.

Viral Video Of Snake And Woman (Photo Credit : Google)
Viral Video : సాధారణంగా చిన్న పామును దూరం నుంచి చూసినా ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. భయంతో కాళ్లు చేతులు వణికిపోతాయి. గుండె వేగంగా కొట్టేసుకుంటుంది. పాము నుంచి తప్పించుకునేందుకు ప్రాణ భయంతో దూరంగా పారిపోతాం. అలాంటిది.. ఓ పొడవైన పాము, అదీ విషపూరితమైనది.. మనవైపే వచ్చిందంటే.. ఊహించుకోవడానికే చాలా భయానకంగా ఉంది కదూ. సగం ప్రాణం పోయిన ఫీలింగ్ వచ్చింది కదూ.
మీ సంగతి, మా సంగతి గురించి పక్కన పెడితే.. ఓ మహిళ మాత్రం తన పక్కనే విషపూరితమైన పాము వచ్చినా అస్సలు భయపడలేదు. కనీసం అదరలేదు, బెదరలేదు. ఎలాంటి కంగారు పడలేదు. దీంతో ఆ మహిళ గుండె ధైర్యానికి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఉత్తర భారత దేశంలో ఛత్ పూజ సందర్భంగా మహిళలు నదికి వెళ్లి సూర్యుడికి నమస్కారం చేస్తారు. ఇది వారి సంప్రదాయంలో భాగం. ఇదే కోవలో కొందరు మహిళలు నదిలోకి దిగారు. పూజలు చేసుకుంటున్నారు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, సడెన్ గా పొడవాటి పాము మహిళలు ఉన్న వైపునకు వచ్చింది. అంతే, ఒక్కసారిగా కలకలం రేగింది. పాము రాకను గమనించిన మహిళలు భయంతో కేకలు వేశారు. వెంటనే నీటిలో నుంచి గట్టు మీదకు వచ్చేశారు.
కానీ, ఓ మహిళ మాత్రం అదరలేదు, బెదరలేదు. ధైర్యంగా నీళ్లలోనే నిల్చుంది. ఆ పాము తన వైపుగా వస్తుంటే ఆమె పక్కకు జరిగింది. అది ముందుకు వెళ్లడానికి దారి ఇచ్చింది. విచిత్రంగా.. ఆ పాము కూడా ఆమెకు ఎలాంటి హాని కలిగించలేదు. ఆమె పక్క నుంచి వెళ్లిపోయింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఆ మహిళ గుండె ధైర్యానికి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అంతేకాదు దైవంపై ఆమెకున్న అపార నమ్మకం చాలా గొప్పదని నెటిజన్లు కితాబిస్తున్నారు.
ఆ పాము చాలా విషపూరితమైనది నెటిజన్లు చెబుతున్నారు. అయినా ఆమె భయపడకుండా అలాగే నిల్చోవడం నిజంగా చాలా గ్రేట్ అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఛత్ పూజ.. పూర్వాంచలి కమ్యూనిటీకి ముఖ్యమైన పండుగ. సూర్య భగవానుడిని ప్రార్థిస్తారు. ఈ పండుగలో నాలుగు రోజుల కఠినమైన ఆచారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లోని భోజ్‌పురి మాట్లాడే ప్రజలకు.. ముఖ్యంగా ఢిల్లీలో ఇది చాలా ముఖ్యమైనది.
छठ पूजा का यह वीडियो वायरल हो रहा है, जिसमें नदी में पूजा कर रही एक महिला एक सांप को आते हुए देखकर घबराई नहीं बल्कि उसने सांप को अपने पास से जाने का रास्ता दिया। pic.twitter.com/aGM8uaDXva
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 9, 2024
Also Read : అఖండతో పుష్ప.. ఫైర్ ప్రొమో వచ్చేసింది..