Unstoppable Season 4 : అఖండతో పుష్ప.. ఫైర్ ప్రొమో వచ్చేసింది..
నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది.

Balakrishna Unstoppable Season 4 Episode 4 Promo Icon Star Allu Arjun
నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్యలు అతిథులుగా వచ్చారు. ఇక నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చారు. పుష్ప 2 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేశారు.
కాగా.. నాలుగో ఎపిసోడ్ సంబంధించిన ప్రొమో వచ్చేసింది. అల్లు అర్జున్ రాగానే బాలయ్య మన ఇద్దరం రిలేటివ్స్ అనగా ఎలా అని బన్నీ అడిగితే నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని చెప్పారు బాలయ్య. మీరు గీత ఇవ్వండి, మేము కురుక్షేత్రం చేస్తామని అల్లు అర్జున్ అన్నారు. ఆ తరువాత మీరు నాకు పార్టీ ఇవ్వలేదని బాలయ్య అడిగారు.
Allu Arjun : అల్లు అర్జున్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక..
ఆ తరువాత పలువురు స్టార్స్ ఫోటోలను చూపిస్తూ.. వారిని చూడగానే ఏమి అనిపిస్తుందని బాలయ్య అడిగారు. మొదట చిరంజీవి, ఆ తరువాత మహేశ్ బాబు ఫోటోలను చూపించారు. వారిద్దరి గురించి బన్నీ ఏమని చెప్పారో ఫుల్ ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక ఈ ఫైర్ ఎపిసోడ్ నవంబర్ 15న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.