Omicron Variant: కోవిడ్ రూల్స్ పాటించట్లేదు.. దేశంలో ఒమిక్రాన్ ఇంకా వేగంగా వ్యాపించొచ్చు -సర్వే!

గడిచిన పది రోజుల్లో, దేశంలో 50కి పైగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Omicron Variant: కోవిడ్ రూల్స్ పాటించట్లేదు.. దేశంలో ఒమిక్రాన్ ఇంకా వేగంగా వ్యాపించొచ్చు -సర్వే!

Omicron

Updated On : December 15, 2021 / 7:41 AM IST

Omicron Variant: గడిచిన పది రోజుల్లో, దేశంలో 50కి పైగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ భారత్‌లో సామాజిక దూరాన్ని ఎవరూ పాటించట్లేదని, కరోనా నిబంధనలు గాలికి వదిలేశారని ఓ సర్వే వెల్లడించింది.

లోకల్‌సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో.. Omicron తర్వాత ప్రజలు అలర్ట్ అయ్యారో లేదో తెలుసుకోవడానికి LocalCircles సర్వే చేసిందని, ఈ సర్వే ప్రకారం.. దేశంలో వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, రోజువారీ కరోనా కేసులు కూడా 10వేల కంటే తగ్గాయని, కానీ, ఇటువంటి పరిస్థితిలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడం పూర్తిగా మానేశారని సర్వే చెబుతోంది.

కరోనా వైరస్ నివారించడానికి ఏకైక, ఖచ్చితమైన మార్గం మాస్క్ ధరించడం.. సామాజిక దూరాన్ని పాటించడం అని సర్వే స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఒమిక్రాన్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) దీనిని ‘ఆందోళనకరమైన వేరియంట్’గా అభివర్ణించిందని వెల్లడించింది సర్వే.

నామమాత్రంగా సామాజిక దూరం -సర్వే
లోక్‌సర్కిల్స్‌ ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 303 జిల్లాల నుంచి 25,000 మందికి పైగా అభిప్రాయాలు తీసుకుంది. సర్వేలో, వారి నగరం/జిల్లా/ప్రాంతంలోని ప్రజలు ఇప్పుడు సామాజిక దూరం నిబంధనలను ఎలా పాటిస్తున్నారని ప్రజలను ప్రశ్నించింది. ప్రతిస్పందనగా, 83 శాతం మంది ప్రజలు తమ ప్రాంతంలో సామాజిక దూరాన్ని పాటించట్లేదని స్పష్టం చేసింది.

30-60 శాతం మంది మాత్రం కోవిడ్ రూల్స్ ఫాలో అవుతున్నారని 11 శాతం మంది చెప్పారు. అదే సమయంలో 60-90 శాతం మంది ఈ మార్గదర్శకాలను అనుసరిస్తున్నారని రెండు శాతం మంది చెప్పారు. అదే సమయంలో నాలుగు శాతం మంది దీనిపై ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు.