కిక్కు కోసం, నిద్రమాత్రలు మింగిన సీనియర్ నటి కుమారుడు
దివంగత నటి మనోరమ కొడుకు భూపతి అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగడం కలకలం రేపింది. చెన్నైలోని స్థానిక టీనగర్‌లోని నీలకంఠం మెహతా వీధిలో భూపతి కుటుంబ

దివంగత నటి మనోరమ కొడుకు భూపతి అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగడం కలకలం రేపింది. చెన్నైలోని స్థానిక టీనగర్‌లోని నీలకంఠం మెహతా వీధిలో భూపతి కుటుంబ
దివంగత నటి మనోరమ కొడుకు భూపతి అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగడం కలకలం రేపింది. చెన్నైలోని స్థానిక టీనగర్‌లోని నీలకంఠం మెహతా వీధిలో భూపతి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. భూపతికి మద్యం తాగే అలవాటు ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. మద్యం దొరక్కపోవడంతో భూపతి మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అది తట్టుకోలేక అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు భూపతిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దీనిపై భూపతి కొడుకు రాజరాజన్ స్పందించాడు. తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన విషయం వాస్తవమేనన్నాడు. మద్యం అలవాటున్న తన తండ్రి మత్తు కోసం నిద్ర మాత్రలు వేసుకున్నాడని చెప్పారు. అంతే కానీ ఇది ఆత్మహత్యాయత్నం కాదని స్పష్టం చేశాడు. దయచేసి వదంతులు ప్రచారం చేయవద్దని కోరాడు.(కోవిడ్ -19 నుండి కుటుంబాన్ని రక్షించడానికి కారులో నివసిస్తున్న భోపాల్ డాక్టర్)
కాగా కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు పూర్తిగా బంద్ అయ్యాయి. దీంతో మద్యపానం అలవాటు ఉన్నవాళ్లకు పిచ్చెక్కిపోతోంది. మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూసివేయడంతో మందుబాబులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
పూర్తి స్తాయిలో లాక్ డౌన్ అమలు చేసినప్పటికీ, కొంత సమయం పాటు మద్యం దుకాణాలను తెరవాలని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఇటీవలే ప్రభుత్వాలను కోరిన సంగతి తెలిసిందే. సమాజంలో పరిస్థితులు బాగోలేవని, జనాలు నిరాశతో ఇంట్లోనే ఉంటున్నారని, ఇలాంటి సమయంలో మద్యం అవసరమని ఆయన అన్నారు.