Sonali Phogat Death Case: సోనాలి ఫోగట్ మృతి కేసు సీబీఐకి? గోవా సీఎం ఏమన్నారంటే..

హర్యానా బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ మృతి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తొలుత ఆమె గుండెపోటుతో మృతిచెందిందని అంతా భావించినా కుటుంబ సభ్యులు సోనాలి ఫోగట్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తేలడంతో పోలీసులు హత్యగా భావించి దర్యాప్తును వేగవంతంగా చేశారు.

Sonali Phogat Death Case: సోనాలి ఫోగట్ మృతి కేసు సీబీఐకి? గోవా సీఎం ఏమన్నారంటే..

Sonali Phogat

Updated On : August 28, 2022 / 2:38 PM IST

Sonali Phogat Death Case: హర్యానా బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ మృతి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తొలుత ఆమె గుండెపోటుతో మృతిచెందిందని అంతా భావించినా కుటుంబ సభ్యులు సోనాలి ఫోగట్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తేలడంతో పోలీసులు హత్యగా భావించి దర్యాప్తును వేగవంతంగా చేశారు. దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు మత్తు పానీయం ఇచ్చారని పోలీసులు గుర్తించారు.

Sonali Phogat death: గుండెపోటు నుండి హత్య వరకు.. సోనాలి ఫోగట్ మృతికేసులో కీలక ములుపులు.. తాజాగా డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్ అరెస్ట్

ఇదిలాఉంటే.. అవసరమైతే సోనాలి ఫోగట్‌ మృతి కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి అప్పగిస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఆదివారం తెలిపారు. ఓ జాతీయ మీడియాతో సీఎం సావంత్ మాట్లాడుతూ.. హర్యానా సిఎం ఖట్టర్ నాతో మాట్లాడి.. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారని తెలిపారు. కుటుంబ సభ్యులు తనను వ్యక్తిగతంగా కలుసుకుని కేసును సీబీఐకి అప్పగించాలని కోరారన్నారు. విచారణకు వేగవంతం చేయాలని పోలీస్ శాఖకు ఆదేశించానని, అవసరమైతే తదుపరి దర్యాప్తు కోసం గోవా ప్రభుత్వం కేసును సీబీఐకి బదిలీ చేస్తుందని సీఎం పేర్కొన్నారు.

Sonali Phogat Death Case : గుండెపోటుతో చనిపోలేదు.. నటి సోనాలి ఫోగట్ మృతి కేసులో ట్విస్ట్ ఇచ్చిన గోవా పోలీసులు

సోనాలీ హత్యకేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిలో డ్రగ్ పెడ్లర్ దత్ ప్రసాద్, అంజునాలోని కర్లీస్ యాజమాని ఎడ్విన్ నూన్స్ ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి సోనాలీ మరణంపై సీబీఐ విచారణకు హామీ ఇచ్చారని ఫోగట్ సోదరి రూపేష్ చండీగఢ్‌లో సిఎం ఖట్టర్‌ను కలిసిన తర్వాత చెప్పారు.