Sonali Phogat death: గుండెపోటు నుండి హత్య వరకు.. సోనాలి ఫోగట్ మృతికేసులో కీలక ములుపులు.. తాజాగా డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్ అరెస్ట్

హర్యానా బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ మృతి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తొలుత ఆమె గుండెపోటుతో మృతిచెందిందని అంతా భావించినా కుటుంబ సభ్యులు సోనాలి ఫోగట్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తేలడంతో పోలీసులు హత్యగా భావించి దర్యాప్తును వేగవంతంగా చేశారు. దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Sonali Phogat death: గుండెపోటు నుండి హత్య వరకు.. సోనాలి ఫోగట్ మృతికేసులో కీలక ములుపులు.. తాజాగా డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్ అరెస్ట్

sonali phogat

Sonali Phogat death: హర్యానా బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ మృతి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తొలుత ఆమె గుండెపోటుతో మృతిచెందిందని అంతా భావించినా కుటుంబ సభ్యులు సోనాలి ఫోగట్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోస్ట్ మార్టం నివేదికలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు తేలడంతో ఆమెది హత్య అని నిర్ధారించిన పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు. ఈ క్రమంలో ఆమె చనిపోయే ముందు రోజురాత్రి గోవాలోని కర్లీస్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసిన ఒక పెడ్లర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సోనాలి వ్యక్తిగత సహాయకులు సుధీర్ సగ్వాన్, సుఖ్విందర్ సింగ్ జ్యూస్‌లో మత్తు పదార్ధం కలిపి ఆమెను బలవంతంగా తాగించారని గోవా పోలీసులు ధృవీకరించిన ఒకరోజు తర్వాత ఇది జరిగింది. సహాయకులను అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.

Sonali Phogat Death Case : గుండెపోటుతో చనిపోలేదు.. నటి సోనాలి ఫోగట్ మృతి కేసులో ట్విస్ట్ ఇచ్చిన గోవా పోలీసులు

ఇదిలాఉంటే సోనాలి ఫోగట్ మృతికేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. తొలుత సోనాలి ఫోగట్ ఆగస్టు 23న గోవాలో గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆమె అసౌకర్యానికి గురైందని, ఏదో చేపల గురించి ఫోన్ లో సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆగస్టు 24న షూటింగ్ ఉన్నందున ఆ తేదీలలో గోవా వెళ్లే ఆలోచన లేదని, అయితే ఆమె వ్యక్తిగత సహాయకుల ద్వారా బుకింగ్ అంతకు ముందే జరిగిందని సోనాలి ఫోగట్ సోదరుడు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులు మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.

Sonali Phogat: సోనాలి ఫోగట్ ఒంటిపై గాయాలు.. పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడి

సోనాలి మృతిని తొలినుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న కటుంబ సభ్యులు.. గోవాలో పోస్ట్ మార్టంను వీడియో ప్రక్రియ ద్వారా నిర్వహించాలని షరతులు పెట్టారు. దీంతో ఆమె పోస్టుమార్టం నివేదికలో శరీరంపై గాయాలు ఉన్నట్లు తేలింది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని హర్యానాకు తరలించి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.

2 Girls Fight In Public: బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్‌లో కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. చివరకు అబ్బాయి ఏం చేశాడంటే..?

రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సోనాలి ఫోగట్ తో బలవంతంగా స్పైక్ వాటర్ తాగించారని గోవా పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఫోగాట్ తనంతట తానుగా నడవలేక రెస్టారెంటు నుండి బయటకు వెళ్తున్న పుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి. ఈ క్రమంలో పోలీసులు రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఆర్థిక ప్రయోజనాలే కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే కర్లీస్ గోవాలోని అంజునా బీచ్‌లోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు వివాదాస్పదం కావటం ఇది మొదటిసారి కాదు. 2008లో బ్రిటీష్ యువతి స్కార్లెట్ ఈడెన్ కీలింగ్ బీచ్‌లో శవమై కనిపించింది. దానికి ముందు ఆమెను కర్లీస్‌కు తీసుకెళ్లినట్లు నివేదించబడింది.