హాస్పిటల్ లో చేరిన సోనియాగాంధీ

  • Published By: venkaiahnaidu ,Published On : July 30, 2020 / 09:40 PM IST
హాస్పిటల్ లో చేరిన సోనియాగాంధీ

Updated On : July 31, 2020 / 10:34 AM IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. రాత్రి 7 గంటల సమయంలో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే క్రమంలోనే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.


ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని సర్ గంగారాం ఆస్పత్రికి చెందిన డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. కాగా, సోనియాగాంధీ గతంలో అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్న విషయం తెలిసిందే.