Sonia Gandhi dance: డ్యాన్స్ చేసిన సోనియా గాంధీ.. వీడియో వైరల్

ఆ మహిళా రైతులను సోనియా గాంధీ తమ ఇంటికి లంచ్ కు ఆహ్వానించి, వారికి ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పించారు.

Sonia Gandhi dance: డ్యాన్స్ చేసిన సోనియా గాంధీ.. వీడియో వైరల్

Sonia Gandhi dance

Updated On : July 16, 2023 / 9:18 PM IST

Sonia Gandhi dance – Video: యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ హరియాణా (Haryana) మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జులై 8న హరియాణాలోని సోనేపట్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో డ్యాన్స్ చేసిన మహిళా రైతులే ఇప్పుడు సోనియా గాంధీతో డ్యాన్స్ చేయడం గమనార్హం.

రాహుల్ గాంధీ హరియాణాలో పర్యటించే సమయంలో ఆయనతో మహిళా రైతులు మాట్లాడారు. ఢిల్లీ నగరాన్ని, అలాగే, అక్కడి రాహుల్ ఇంటిని చూడడానికి వస్తామని అన్నారు. దీంతో తనను లోక్‌సభకు అనర్హుడిగా పర్యటించాక ఢిల్లీలోని తన నివాసాన్ని ప్రభుత్వం తీసేసుకుందని వారికి రాహుల్ చెప్పారు.

అయినప్పటికీ, ఆ మహిళా రైతులను సోనియా గాంధీ తమ ఇంటికి లంచ్ కు ఆహ్వానించి, వారికి ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పించారు. ఈ సందర్భంగానే వారితో సోనియా గాంధీ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ నేతలు షేర్ చేస్తున్నారు.

Bengal Politics: మమతా బెనర్జీ ప్రభుత్వం 5 నెలల్లో కూలిపోతుందట.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు