Bharath Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న తల్లి సోనియా షూ లేస్‌లు కట్టిన రాహుల్ గాంధీ.. పాదయాత్రలో మరెన్నో అద్భుత దృశ్యాలు.. మీరూ చూడండి..
భారత్ జోడో పాదయాత్రలో సోనియాగాంధీ పాల్గొనడంతో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా తల్లి సోనియాగాంధీ షూ లేస్ ఊడిపోవడంతో రాహుల్ గమనించి లేస్‌లు కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Bharath jodo yatra
Bharath Jodo Yatra: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణులు మధ్య ఉత్సాహంగా సాగుతుంది. రెండు రోజుల విరామం తరువాత ప్రారంభమైన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొన్నారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దినెలలుగా ఆమె ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కాగా గురువారం రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో సోనియా పాల్గొన్నారు. కొడుకు రాహుల్ వెంట ఉత్సాహంగా నడుస్తూ ముందుకు సాగారు.
वो साँस भी लेती है तो, उनमें भी दुआएं होती हैं
माँओं का तोड़ नही होता, माएँ तो माएँ होती हैं !?#BharatJodoYatra @INCIndia pic.twitter.com/npjsJnCah3— Shashi Tharoor (@ShashiTharoor) October 6, 2022
భారత్ జోడో పాదయాత్రలో సోనియాగాంధీ పాల్గొనడంతో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా తల్లి సోనియాగాంధీ షూ లేస్ ఊడిపోవడంతో రాహుల్ గమనించి లేస్‌లు కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Unfazed, Undeterred & United.
More power to our fight against tyrannical and divisive forces as Congress President Smt Sonia Gandhi joins the march. #BharatJodoWithSoniaGandhi pic.twitter.com/qsGqLQzBJ5
— Congress (@INCIndia) October 6, 2022
సోనియాగాంధీ పాదయాత్రలో రాహుల్ వెంట ఉత్సాహంగా పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొడుకు చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా సోనియాగాంధీ పాల్గొనడంతో, ఇద్దరు కలిసి స్థానిక ప్రజలకు కరచాలనం చేసుకుంటూ ముందుకు సాగడం చూసి కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
A mother despite her illness joins the fight that the son has taken up and a son who amidst the fight makes sure that his mother is in good health.
What is a lovely mother-son bond if not this care and compassion? #BharatJodoWithSoniaGandhi pic.twitter.com/TqvYc2L2ru
— Srinivas BV (@srinivasiyc) October 6, 2022
భారత్ జోడో పాదయాత్రలో పాల్గొన్న సోనియాగాంధీ కొద్దిసేపు రాహుల్ తో కలిసి నడిచారు. అయితే తన తల్లి అనారోగ్యంపై ఆందోళన చెందిన రాహుల్ గాంధీ.. కారులో ఉండి యాత్రలో పాల్గొనాలని సోనియాకు సూచించారు. అయితే అందుకు సోనియా.. పర్వాలేదు.. అన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కొద్దిసేపు అనంతరం సోనియా కారులో ఉండి యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న సోనియా రాహుల్ చేయి పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ సైతం తల్లిని పట్టుకొని నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
సోనియా, రాహుల్ పాదయాత్రగా వెళ్తున్న సమయంలో కొందరు మహిళలు, చిన్నారులు వారితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో చిన్నారులు కిందపడటంతో అది గమనించిన రాహుల్, సోనియా వారి వద్దకు వెళ్లి కిందపడిన చిన్నారిని దగ్గరకు తీసుకొని ఏమైన దెబ్బలు తగిలాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. చిన్నారి గౌనుకు మట్టి అంటినట్లు గమనించిన సోనియా.. ఆ మట్టిని దులపడం వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోసైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..