Actor Sonu Sood : సోనూసూద్ కోసం 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

కరోనా కష్టకాలంలో వేలాది కుటుంబాలను కాపాడి ప్రజల చేత ప్రత్యక్ష దైవంగా కీర్తింపబడుతున్న నటుడు సోనూసూద్.

Actor Sonu Sood : సోనూసూద్ కోసం 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

Sonu Sood Fan Travel 1200 Km On Cycle To Meet Him In Mumbai

Updated On : July 18, 2021 / 1:45 PM IST

Actor Sonu Sood  : కరోనా కష్టకాలంలో వేలాది కుటుంబాలను కాపాడి ప్రజల చేత ప్రత్యక్ష దైవంగా కీర్తింపబడుతున్న నటుడు సోనూసూద్. కోవిడ్ బారిన పడిన వారికి మందులు అందించటం దగ్గర్నించి ఉపాధి లేని వారికి కొన్నాళ్లకు సరిపడా ఆహారధాన్యాలు అందించటం మొదలు ఎన్నో రకాలుగా ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పించి పేదవారి గుండెల్లో దేవుడై కోలువు దీరాడు సోనూసూద్.

ప్రభుత్వాలు చేయలేని సాయం 24 గంటల్లో సోనూ సూద్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ కరోనా కాలంలో.  ఆయన చేసిన సేవలకు కొందరైతే గుడులు కట్టించి పూజలు కూడా చేస్తున్నారు. మరికొందరు వారికి పుట్టిన పిల్లలకు సోనూ సూద్ పేరు పెట్టుకుంటున్నారు. సోనూ సూద్ పై తమకున్న అభిమానాన్ని ఏదో రకంగా చూపించుకుంటున్నారు.

ఏదో ఒక రకంగా సోనూ సూద్ ను కలవటానికి ఇంకొంత మంది వీరాభిమానులైతే వారి ఇంటి వద్దనుంచి ముంబై లోని సోనూ సూద్ ఇంటిదాకా పాదయాత్రలు చేస్తున్నారు. ఇటీవల కొందరు అలాగే సోనూ సూద్ ఇంటివరకు పాదయాత్ర చేసి అక్కడ ఆయన్ను కలిసి ఆనందించారు. తాజాగా మరోక వ్యక్తి 1200 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి సోనూ సూద్ ను కలిసి సంతోషంపంచుకున్నాడు.

పూరీ కి చెందిన సింబా అనే అభిమాని సైకిల్ పై 1200 కిలోమీటర్లు ప్రయాణించి ముంబైలో సోనూ సూద్ ను కలిశాడు. సింబా సోనూసూద్ కు పూలదండ వేయబోగా ఆయన ఆ పూలదండను అభిమాని మెడలోనే వేసారు.   సింబా,  సోనూ సూద్ పాదాల వద్ద పూలు   ఉంచటానికి ప్రయత్నించగా సోనూసూద్ అందుకు అంగీకరించలేదు.   తనపై అభిమానంతో సింబా పాడిన పాటను విని సోనూసూద్ సంతోషించాడు.