బీసీసీఐ కొత్త టీమ్..ఫొటో షేర్ చేసిన గంగూలీ

అక్టోబర్-23,2019న బీసీసీఐ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ కొత్త టీమ్ ఫోటోను గంగూలీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. మేము బాగా పనిచేయగలమని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ లో తెలిపారు. మాజీ బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ కూడా ఆ ఫోటోలో కన్పిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ గంగూలీని బీసీసీఐ ప్రెసిడెంట్ గా చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.
బీజేపీ చీఫ్,కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా,అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ దుమాల్,జయేష్ జార్జి,మహిమ్ వర్మ గంగూలి షేర్ చేసిన ఫొటోలో ఉన్నారు. జై షా బీసీసీఐ సెక్రటరీ పదవి చేపట్టనుండగా,అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ బాధ్యతలు చేపట్టనున్నారు. మహిమ్ వర్మ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా,జయేష్ జార్జి జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రపంచంలోకెల్లా ధనిక క్రికెట్ బోర్డు.. ప్రపంచ క్రికెట్‌ను శాసించే క్రికెట్ బోర్డు బీసీసీఐ. అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి. అటువంటి బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సోమవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి గంగూలీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక లాంఛనప్రాయయం కానుంది. గంగూలీతో పాటు జై షా బీసీసీఐ కార్యదర్శి పదవికి నామినేషన్ వేయగా.. ట్రెజరర్‌గా అరుణ్ ధూమల్ నామినేషన్ వేశారు.
The new team at. @bcci .. hopefully we can work well .. anurag thakur thank you for seeing this through @ianuragthakur pic.twitter.com/xvZyiczcGq
— Sourav Ganguly (@SGanguly99) October 14, 2019