Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్.. ఎప్పటి నుంచి అంటే..

ప్రముఖ పండుగలకు ప్రతీయేటా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో ..

Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్.. ఎప్పటి నుంచి అంటే..

South Central Railway

Updated On : September 12, 2024 / 7:26 AM IST

South Central Railway : పండుగల వేళ ప్రయాణీకులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తుంటారు. దీంతో ప్రముఖ పండుగల సమయాల్లో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారుతాయి. ఈ క్రమంలో తెలుగు ప్రముఖ పండుగలకు ప్రతీయేటా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగల సందర్భంగా రెండు మార్గాల్లో 24 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది దక్షిణ మధ్య రైల్వే. దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 24 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. అయితే, వారానికి ఒకసారి చొప్పున ఆరు ట్రిప్పులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి.

Also Read : Ayushman Bharat Scheme : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు ఆరోగ్య బీమా..

సికింద్రాబాద్ – తిరుపతి రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది.
తిరుపతి – సికింద్రాబాద్ రైలు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.
తిరుపతి – శ్రీకాకుళం రైలు అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది.
శ్రీకాకుళం – తిరుపతి రైలు అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.