ఇదేంపనయ్యా : హాస్పిటల్ లో పొగ తాగిన ఎస్పీ నేత..

బహిరంగ ప్రదేశాల్లో ‘పొగ త్రాగరాదు’ అనే బోర్డులు చూస్తుంటాం. బస్టాపులు..సినిమాహాల్స్,స్కూల్స్ లలో పొగ త్రాగకూడదు. కానీ ఓ రాజకీయ నేత ఏకంగా హాస్పిటల్ లో పొగతాగి ఘటన వివాదానికి దారి తీసింది. ఉత్తరప్రదేశ్ మోర్దాబాద్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు హాజీ ఇక్రమ్ ఖురేషి పొగ తాగి వివాదాస్పదమైంది.
అక్టోబర్ 22 ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా మోర్దాబాద్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు ఖురేషి. ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత ఖురేషి హాస్పిటల్ ఆవరణలోనే పొగ తాగారు. ఖురేషి పొగ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఖురేషిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వీడియో వైరల్ కావటంతో మీడియా ఖురేషీని ప్రశ్నించగా..మీడియాపై ఫైర్ అయ్యారు. తాను పొగ తాగినప్పుడు ఆస్పత్రి ఆవరణలో లేననీ..ఆ పక్కనే ఉన్న పార్క్ దగ్గరలో ఉన్నానని అన్నారు. మీడియాకు కావాల్సింది ఏదోక ఇష్యూపై ప్రచారారాలు ..అందుకే ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తారంటూ తీవ్రంగా మండిపడ్డారు ఖురేషి.
#WATCH SP leader Haji Ikram Qureshi was seen smoking inside hospital premises in Moradabad, earlier today, where he had gone to distribute fruits to patients on the occasion of birthday of Samajwadi Party founder Mulayam Singh Yadav. pic.twitter.com/zFsRpM3Se4
— ANI UP (@ANINewsUP) November 22, 2019