బ్రాహ్మణులకు ‘ప్రత్యేక టాయ్ లెట్’: కులపిచ్చి పీక్స్ అంటే ఇదే..

‘ఈ మరుగుదొడ్డి బ్రాహ్మణులకు మాత్రమే’భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అను చెప్పుకునే ప్రముఖ దేవాలయంలో బ్రాహ్మణులకు ప్రత్యేక టాయ్ లెట్.  

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 04:26 AM IST
బ్రాహ్మణులకు ‘ప్రత్యేక టాయ్ లెట్’: కులపిచ్చి పీక్స్ అంటే ఇదే..

Updated On : March 7, 2020 / 4:26 AM IST

‘ఈ మరుగుదొడ్డి బ్రాహ్మణులకు మాత్రమే’భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అను చెప్పుకునే ప్రముఖ దేవాలయంలో బ్రాహ్మణులకు ప్రత్యేక టాయ్ లెట్.  

టెక్నాలజీలో దూసుకుపోతున్నాం..భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పుకుంటుంటాం. కానీ కప్యూటర్ యుగంలో కూడా కులపిచ్చి పోవట్లేదు. అంతకంతకూ పెరుగుతున్న కుల పిచ్చిలతో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఈ కులపిచ్చి ఎంతగా పెరిగిందంటే..భగవంతుడు ఒక్కడే..దారులు ఎన్నైనా పరమాత్ముడు ఒక్కడే అని చెప్పే దేవాలయంలో బ్రాహ్మణులకు ప్రత్యేక టాయ్ లెట్ అని రాసిపెట్టారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అని చెప్పే పండితులు తమకు ప్రత్యేకించి ఓ టాయ్ లెట్ ఉండాలనుకున్నారు. దీంతో ఇది బ్రాహ్మణులకు మాత్రమే అని టాయ్ లెట్ గోడపై రాసి పెట్టిన ఘటన కేరళలో జరిగింది. 

కేరళలోని కుట్టుముక్కు మహాదేవ ఆలయంలో ఓ మూల ఉన్న టాయిలెట్ల వద్ద ‘ఈ మరుగుదొడ్డి బ్రాహ్మణులకు మాత్రమే’ అని రాసి పెట్టారు. అక్కడ మూడు టాయిలెట్లు ఉన్నాయి. వాటిలో ఒకదానిపై ‘స్త్రీలకు’, ‘పురుషులకు’, అని రాసి ఉంది.మూడవదానిపై ఇది ‘బ్రాహ్మణులకు’ అని రాసి ఉంది. దీనితో అరవింద్ క్రిస్టో అనే PHDవిద్యార్థి ఫోటోలు తీసి ఈ కులపిచ్చిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.దీనిపై స్థానికంగా పెద్ద వివాదానాకి దారితీసింది. దీంతో కొచ్చిన దేవాలయం బోర్డు అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు 

ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అరవింద్ క్రిస్టో మాట్లాడుతూ..తాను ఆలయంలో జరిగే ఉత్సవానికి వెళ్లాను. టాయ్ లెట్ అవసరం అయి అటు వెళ్లగా టాయ్ లెట్ ముఖద్వారంపై ‘ఇది బ్రాహ్మణులకు మాత్రమే’అని రాసి ఉండటం చూశాను..షాక్ అయ్యారు.తరువాత దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఎందుకంటే అది వైరల్ గా మారితే ఆ బోర్డు తీసివేస్తారనే ఉద్ధేశంతో అలా చేశానని తెలిపాడు.  

ఇది స్థానిక యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు అరవింత్ పల్లిల్ దృష్టికి వెళ్లటంతో వారు కుట్టుముక్కు మహాదేవాలయం కార్యదర్శి ప్రేమ కుమార్ కు ఫిర్యాదు చేయగా..ఆయన ఈ విషయం మాదృష్టికి వచ్చాక బోర్డును తొలగించామని తెలిపారు.  

ఇప్పటివరకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి,పెళ్లి చేయడానికి మీకులం ఏమిటీ అని అడిగేవారు. ఇప్పుడు మరుగుదొడ్లులకు కూడా ఈ కులపిచ్చి పాకిందా? అంటున్నారు నెటిజన్లు. 

See Also | గాంధీలో కరోనా బాధితుడికి మంత్రి ఈటల పరామర్శ, మాస్క్ లేకుండానే..