Katra Keshav Dev Temple : శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం..మసీదుకి మరో చోట రెట్టింపు స్థలం!

మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న 17వ శతాబ్దం నాటి షాహి మసీదు మసీదు తొలగింపుపై హిందూ సంస్థ "శ్రీ కృష్ణ జ్మభూమి ముక్తి ఆందోళన్ సమితి"మంగళవారం మథుర కోర్టును ఆశ్రయించింది.

Katra Keshav Dev Temple : శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం..మసీదుకి మరో చోట రెట్టింపు స్థలం!

Mathura

Updated On : June 23, 2021 / 3:07 PM IST

Katra Keshav Dev Temple మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న 17వ శతాబ్దం నాటి షాహి మసీదు మసీదు తొలగింపుపై హిందూ సంస్థ “శ్రీ కృష్ణ జ్మభూమి ముక్తి ఆందోళన్ సమితి”మంగళవారం మథుర కోర్టును ఆశ్రయించింది.

మసీదును స్వచ్ఛందంగా తొలగించేందుకు ఇంతజామియా కమిటీ(మసీదు నిర్వహణ కమిటీ)అంగీకరిస్తే..ముస్లింలకు అంతకంటే రెట్టింపు భూమిని ఇచ్చేందుకు సిద్ధమమని,దీనికి పరిష్కారం చూపాలని తన పిటిషన్ లో కోరింది. ఈ మేరకు మథుర సివిల్ కోర్టు సీనియర్ జడ్జికి దరఖాస్తు చేశారు. మథురలోని చౌరాసి కోస్ ప్రాంతంలో ఇంతజామియా కమిటీకి పెద్ద మొత్తంలో భూమి ఇస్తామని ముక్తి ఆందోళన్ సమితి అధ్యక్షుడు మహేంద్ర ప్రతాప్ సింగ్ కోర్టుకి తెలిపారు. మసీదు నిర్వహణ కమిటీ ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదుని స్వచ్ఛందంగా తొలగించి ఆ భూమిని సమితికి అప్పగిస్తే…చౌరాసి కోస్ ప్రాంతం సరిహద్దుల్లో కూడా మరింత భూమిని ఇస్తామని తెలిపింది.

కాగా, 2020 డిసెంబర్ నుంచి ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. 1967లో కోర్టు ఆమోదంతో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థ, షాహి ఈద్గా మేనేజ్​మెంట్ కమిటీ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. 13.37 ఎకరాల విస్తీర్ణంలోని శ్రీ కృష్ణ జన్మభూమిలోని కత్రా కేశవ్ దేవ్ ఆలయంపై 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దాడి చేసి మసీదు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై సివిల్ కోర్టుల్లో పలు దరఖాస్తులు, పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.