Sri Lanka thanks India: సాయం చేసినందుకు థ్యాంక్యూ ఇండియా: శ్రీలంక
అప్పుల్లో కూరుకుపోయిన తమ దేశానికి సాయం చేస్తున్నందుకు భారత్ కు శ్రీలంక కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది 31 వేల కోట్ల రూపాయల క్రెడిట్ లైన్ ఇచ్చి భారత్ చాలా సాయం చేసిందని చెప్పింది. అలాగే, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సహకరిస్తామని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)కు భారత్ భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది.

Sri Lanka thanks India
Sri Lanka thanks India: అప్పుల్లో కూరుకుపోయిన తమ దేశానికి సాయం చేస్తున్నందుకు భారత్ కు శ్రీలంక కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది 31 వేల కోట్ల రూపాయల క్రెడిట్ లైన్ ఇచ్చి భారత్ చాలా సాయం చేసిందని చెప్పింది. అలాగే, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సహకరిస్తామని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)కు భారత్ భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది.
భారత విదేశాంగ మంత్రి జై శంకర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం కొలంబో వెళ్లారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, విదేశాంగ మంత్రి అలీ సాబ్రీతో నిన్న జై శంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే భారత్ కు, జైశంకర్ కు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సాబ్రీ కృతజ్ఞతలు తెలిపారు. జైశంకర్ తో పలు అంశాలపై చర్చించానని అన్నారు. ద్వైపాక్షిక సమావేశాలూ నిర్వహించామని చెప్పారు.
మౌలిక వసతులు, విద్యుత్తు, పరిశ్రమలు, ఆరోగ్యం వంటి తదితర అంశాలపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీతో చర్చించానని జై శంకర్ కూడా ట్విట్టర్ లో తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో కలిసి జై శంకర్ గత రాత్రి డిన్నర్ చేశారు. కాగా, ఐఎంఎఫ్ నుంచి 23 వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని శ్రీలంక ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం శ్రీలంక తరఫున ఐఎంఎఫ్ కు ఆర్థిక భరోసా ఇవ్వాలని చైనా, జపాన్, భారత్ ను కోరుతోంది.
కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మద్దతు లేకపోతే శ్రీలంక తిరిగి కోలుకునే అవకాశమే లేదని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. మళ్ళీ రుణాలు పొందేందుకు అనుసరించాల్సిన చర్యలపై దృష్టి పెట్టామని, తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయత్నాలు జరుపుతున్నామని విక్రమసింఘే ఇటీవలే చెప్పారు. దీనిపై జపాన్, చైనా, భారత్ తో ఇప్పటికే చర్చలు ముగించామని అన్నారు.
Maharashtra CM: తాను మోదీ భక్తుడినని లక్సెంబర్గ్ ప్రధాని నాకు చెప్పారు: మహారాష్ట్ర ముఖ్యమంత్రి