Tamil Nadu Governor : గవర్నర్ Vs సీఎం.. తగ్గేదే లే అంటున్న స్టాలిన్
గవర్నర్ నీట్ బిల్లును 142 రోజుల పాటు తనవద్దే ఉంచుకొన్నారని, సరిగ్గా మెడికల్ అడ్మిషన్లు ప్రారంభమైన సమయంలోనే స్పీకర్‌కు పంపించారని స్టాలిన్ ఆరోపించారు...

Tamil Nadu
NEET Exemption Bill : నీట్ మినహాయింపు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది.ఈ విషయంలో సీఎం స్టాలిన్, గవర్నర్ రవి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపును ఇవ్వాలని అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ రవి తిప్పి పంపించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ విషయంపై స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 10 పార్టీలు హాజరయ్యాయి. డీఎంకే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో పాటు పలు పార్టీ నేతలు మీటింగ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ రవి తీరుపై స్టాలిన్ అఖిలపక్షంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read More : Odisha Journalist : బాంబు పేలి జర్నలిస్టు మృతి
గవర్నర్ నీట్ బిల్లును 142 రోజుల పాటు తనవద్దే ఉంచుకొన్నారని, సరిగ్గా మెడికల్ అడ్మిషన్లు ప్రారంభమైన సమయంలోనే స్పీకర్‌కు పంపించారని స్టాలిన్ ఆరోపించారు. మరోవైపు అఖిలపక్ష సమావేశం నీట్ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును తిరిగి గవర్నర్‌కు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. నీట్ బిల్లు విషయంపై ఎల్లుండి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని, అక్కడి నుంచే తిరిగి గవర్నర్‌కు ఈ బిల్లును తిరిగి పంపాలని అఖిలపక్షం నిర్ణయించుకుంది.
Read More : Social Media : కేసీఆర్‌పై అనుచిత పోస్ట్‌లు-ఆరుగురి రిమాండ్, మరో ఇద్దరిపై కేసు
గవర్నర్ నిర్ణయంపై పార్టీలకు అతీతంగా విమర్శలు తలెత్తుతున్నాయి. గవర్నర్ రవి నిర్ణయాన్ని ఖండిస్తూ… ట్విట్టర్ లో గెట్ అవుట్ రవి అనే యాష్ ట్యాగ్ తో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూల నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, మనోభావాలను గౌరవించలేనప్పుడు తప్పుకోవాలంటూ వారు ట్వీట్ చేశారు. లోక్ సభలో సైతం డీఎంకే ఎంపీ టీఆర్ బాలు గళం వినిపించారు. ఐదు నెలల అనంతరం ఆ బిల్లును పంపించడం వెనుక అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. సాధారణంగా అసెంబ్లీ పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించి… రాష్ట్రపతికి పంపిస్తారని, వెనక్కి పంపిన బిల్లు మళ్లీ గవర్నర్ దగ్గరికి గనుక వస్తే మాత్రం దానిపై ఆయన ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని రాజకీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. తుది నిర్ణయం రాష్ట్రపతికే ఉంటుందని వెల్లడిస్తున్నారు.