Social Media : కేసీఆర్‌పై అనుచిత పోస్ట్‌లు-ఆరుగురి రిమాండ్, మరో ఇద్దరిపై కేసు

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై   సోషల్ మీడియాలో అనుచితి వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు శనివారం రిమాండ్‌కు  తరలించారు. సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరిపై

Social Media : కేసీఆర్‌పై అనుచిత పోస్ట్‌లు-ఆరుగురి రిమాండ్, మరో ఇద్దరిపై కేసు

social media posts

Social Media : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై   సోషల్ మీడియాలో అనుచితి వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు శనివారం రిమాండ్‌కు  తరలించారు. సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరిపై సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే….గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అనుచిత వ్యాఖ్యలు జోడిస్తూ సీఎం కేసీఆర్ చిత్ర పటాన్ని ఎడిట్ చేశారు. దాన్ని ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు కుచెందిన పొన్నెకంటిసురేష్, కారేపల్లి మండలం బొక్కల తండాకు చెందిన హట్కర్ రాంబాబుకు పంపాడు. ఆ ఇమేజ్ ను   రాంబాబు… భద్రాద్రి కొత్త గూడెం జిల్లా టేకుల పల్లికి చెందిన జనగంటి అర్జున్, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం… కొత్త పోచారానికి చెందిన కొండమీది కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా తిరమలాయపాలెం మండలం ఏలూరు గూడెం నివాసి నేల మర్రి నారాయణ, పాతర్లపాడుకు చెందిన నాగేంద్రయ్యలు వివిధ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు.

ఇవి చూసిన కారేపల్లి కిచెందిన టీఆర్ఎస్ నాయకుడు అజ్మీర వీరన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరందరినీ  ఫోన్ నెంబర్లు ఆధారంగా అదుపులోకి తీసుకుని ఇల్లెందు కోర్టులో హజరు పరిచి సబ్ జైలుకు తరలించారు.
Also Read : Equality Statue : తిరునామం, పంచెకట్టుతో మోదీ.. మురిసిపోయిన ముచ్చింతల్
కాగా ట్విట్టర్ లోని ఒక న్యూస్ వెబ్ సైట్ పేరుతో ఉన్నఖాతాలో సీఎం కేసీఆర్ ను దూషిస్తూ పోస్టు పెట్టారని… ఫేస్ బుక్ లో అశోక్ అనే వ్యక్తి సీఎం ను, టీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసారని టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.