Stampede: ఆర్సీబీ విజయోత్సవంలో ఘోర విషాదం.. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట.. 11మంది దుర్మరణం..

అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Stampede: ఆర్సీబీ విజయోత్సవంలో ఘోర విషాదం.. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట.. 11మంది దుర్మరణం..

Updated On : June 5, 2025 / 8:42 AM IST

Stampede: ఐపీఎల్ 2025 విజేత ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు మృతి చెందారు. 33మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఐపీఎల్ 2025 విన్నర్ ఆర్సీబీ జట్టు విక్టరీ పరేడ్ నిర్వహించింది. విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్సీబీ విక్టరీ పరేడ్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిన్నస్వామి స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు వారు ప్రయత్నించారు. అభిమానులను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది.

కాగా, చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్-18 విన్నర్ ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేలాదిగా అభిమానులు తరలి రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

ట్రోఫీతో స్టేడియంలోకి వచ్చే ఆర్సీబీ జట్టుతో వేడుకలు జరుపుకునేందుకు వేలాది మంది అభిమానులు సాయంత్రం నుండే ఎం. చిన్నస్వామి స్టేడియం దగ్గర గుమిగూడారు. దీంతో స్టేడియం పరిసరాల్లో రోడ్లు స్తంభించిపోయాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు సైతం వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు.