Punjab : బతుకుతెరువు కోసం రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ప్రొఫెసర్.. అంత కష్టం ఎందుకొచ్చిందంటే?

హాయిగా విద్యార్ధులకు పాఠాలు చెప్పుకోవాల్సిన ప్రొఫెసర్ రోడ్లపై కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. బండిపై 'పీహెచ్‌డీ సబ్జీవాలా' అనే బోర్డు పెట్టుకుని మరీ కూరగాయలు అమ్ముతున్న ఆ ప్రొఫెసర్ స్టోరీ చదవండి.

Punjab : బతుకుతెరువు కోసం రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ప్రొఫెసర్.. అంత కష్టం ఎందుకొచ్చిందంటే?

Punjab

Updated On : January 2, 2024 / 1:55 PM IST

Punjab : 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి చేసిన ఓ ప్రొఫెసర్ రోడ్లపై కూరగాయలు అమ్ముతున్నారు. హాయిగా క్లాసు రూమ్‌లో పాఠాలు చెప్పుకోవాల్సిన ఆయనకి అంత కష్టం ఎందుకు వచ్చింది? ‘పీహెచ్‌డీ సబ్జీవాలా’ అని అందరూ పిలిచే డాక్టర్ సందీప్ సింగ్ గురించి చదవండి.

సారూ.. ఈ వయసులో బ్యాటింగ్ అవసరమా? బ్యాటింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

డాక్టర్ సందీప్ సింగ్ వయసు 39 సంవత్సరాలు. 4 మాస్టర్ డిగ్రీలు చేసారు. పీహెచ్‌డీ చేసి పంజాబీ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా ఉన్న సందీప్ సింగ్ కూరగాయలు అమ్మడం మొదలుపెట్టారు. ‘పీహెచ్‌డీ సబ్జీవాలా’గా వైరల్ అవుతున్న సందీప్ అసలు ఈ పని చేయడానికి కారణం ఏంటి? అంటే ..

డాక్టర్ సందీప్ పంజాబీ యూనివర్సిటీలో 11 సంవత్సరాలు కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా పనిచేసారు. న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ, పంజాబీలో జర్నలిజం, పొలిటికల్ సైన్స్ వంటి విభాగాల్లో 4 మాస్టర్స్ డిగ్రీలు పొంది ఇంకా తన చదువును కొనసాగిస్తున్నారు. కాగా సమయానికి జీతం రాకపోవడం, తరచు జీతంలో కోతల కారణంగా సందీప్ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. దాంతో బతుకుతెరువు కష్టమైంది. కుటుంబాన్ని పోషించడానికి వేరే మార్గం లేక సందీప్ సింగ్ రోడ్డుపై బండి మీద కూరగాయలు అమ్మడం మొదలుపెట్టారు.

Viral Video : ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ‘జమాల్ కుడు’ పాట.. ఈ పాటకు అర్ధం తెలుసా?

డాక్టర్ సందీప్ సింగ్ కూరగాయల బండి మీద ‘PhD సబ్జీవాలా’ అనే బోర్డుతో ప్రతిరోజు కూరగాయలు అమ్ముతున్నారు. ప్రొఫెసర్‌గా ఉద్యోగం కంటే కూరగాయలు అమ్మడం ద్వారా తను ఎక్కువగా సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు సందీప్. ఇలా కూరగాయలు అమ్మిన డబ్బులో కొంత సొమ్మును పొదుపు చేసి సొంతంగా ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా తనకెంతో ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్ కంటిన్యూ చేయాలని సందీప్ ఆశ పడుతున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో డాక్టర్ సందీప్ సింగ్ స్టోరీ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by MPSC_MOTIVATION_ (@mpsc_motivation_)