‘సన్నీలియోన్‌ నా తల్లి.. ఇమ్రాన్ హష్మీ నా తండ్రి’ అని పరీక్ష ఫామ్‌లో రాసిన విద్యార్థి

ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

‘సన్నీలియోన్‌ నా తల్లి.. ఇమ్రాన్ హష్మీ నా తండ్రి’ అని పరీక్ష ఫామ్‌లో రాసిన విద్యార్థి

Updated On : October 9, 2024 / 5:56 PM IST

Sunny Leone: ఓ విద్యార్థి తన పరీక్ష ఫామ్‌లో ఇమ్రాన్ హష్మీ తన తండ్రి అని, సన్నీ లియోన్‌ అన తల్లి అని రాసుకున్నాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ధనరాజ్ భగత్ డిగ్రీ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కుందన్ అనే విద్యార్థి గతంలో బీఏ హానర్స్ పరీక్ష రాశాడు. ఆ విద్యార్థి కుందన్ 2017-2020 బ్యాచ్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అప్పటి ఫొటోను ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. వారిద్దరి పేర్లను ఆ విద్యార్థి అలా రాసుకున్నప్పటికీ పరీక్ష రాయడానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సన్నీలియోన్‌ పేరును తల్లిగా పేర్కొనడంలో ఆ విద్యార్థి ఉద్దేశం ఏంటని కొందరు ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. తల్లిదండ్రుల పేర్ల స్థానంలో మనకు ఇష్టం వచ్చినవాళ్ల పేర్లు రాసుకోవచ్చా అని కొందరు సెటైర్లు వేశారు.

 

View this post on Instagram

 

A post shared by Rare Indian Images (@indianrareimages)