Shiv Sena: ఉద్ధవ్ థాకరేకు సుప్రీంలో గట్టి ఎదురుదెబ్బ.. శివసేనపై నిర్ణయం ఈసీకే వదిలేసిన ధర్మాసనం

పార్టీని విలీనం చేస్తే తప్పితే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కష్టమని ఉద్ధవ్ వర్గం అంటోంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. షిండే వర్గం ఏదైనా పార్టీలో విలీనం కాకపోతే.. అనర్హతకు అర్హులవుతారని వారు వాదిస్తున్నారు. ఉద్ధవ్ వేసిన పిటిషన్‭పై ఆగస్టు 23న సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన బెంచ్‭కు బదిలీ చేసింది. ఈ కేసులో ఎమ్మెల్యేల అనర్హత, ఫిరాయింపులు, పార్టీ విలీనం వంటి అంశాలు ఉన్నాయి. ఇవి రాజ్యాంలోని కీలక విషయాల్ని లేవనెత్తుతున్నాయని కోర్టు పేర్కొంది.

Shiv Sena: ఉద్ధవ్ థాకరేకు సుప్రీంలో గట్టి ఎదురుదెబ్బ.. శివసేనపై నిర్ణయం ఈసీకే వదిలేసిన ధర్మాసనం

Supreme Court allows poll panel to decide real Shiv Sena

Updated On : September 27, 2022 / 5:58 PM IST

Shiv Sena: ఉద్ధవ్ థాకరేకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తిగిలింది. శివసేన ఎవరిదనే నిర్ణయాన్ని ఎన్నికల సంఘం నిర్ణయించడాన్ని నిలువరించాలని థాకరే వేసిన పిటిషన్‭ను అత్యున్నత ధర్మాసనం తోసి పుచ్చింది. అసలైన శివసేన ఎవరిదనేదే నిర్ణయాధికారన్ని ఎన్నికల సంఘానికే వదిలేస్తున్నట్లు ప్రకటించింది. శివసేన రెండుగా విడిపోయిన అనంతరం అసలైన శివసేనపై తమదంటే తమదే అంటూ అటు ఉద్ధవ్ థాకరే వర్గం, ఇటు ఏక్‭నాథ్ షిండే వర్గం తగువులాడుతూ షిండే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా.. ఉద్ధవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఏక్‭నాథ్ షిండే రెబల్‭గా శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలను బయటికి లాగడంతో ఈ యేడాది జూన్‭లో మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం షిండే వర్గంలోని ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పూనుకుంది ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో షిండే వర్గం సుప్రీంను ఆశ్రయించింది. అయితే అక్కడ వారికి ఊరట లభించింది. అనర్హత వేటును సుప్రీం వ్యతిరేకించింది. ఇక అనంతరం ఇరు వర్గాల మధ్య పార్టీ వైరం పెరిగింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నారని, అసలైన శివసేన తమదేనంటూ షిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. కాగా, పార్టీపై నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఇవ్వొద్దంటూ సుప్రీంను ఉద్ధవ్ వర్గం ఆశ్రయించింది.

పార్టీని విలీనం చేస్తే తప్పితే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కష్టమని ఉద్ధవ్ వర్గం అంటోంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. షిండే వర్గం ఏదైనా పార్టీలో విలీనం కాకపోతే.. అనర్హతకు అర్హులవుతారని వారు వాదిస్తున్నారు. ఉద్ధవ్ వేసిన పిటిషన్‭పై ఆగస్టు 23న సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన బెంచ్‭కు బదిలీ చేసింది. ఈ కేసులో ఎమ్మెల్యేల అనర్హత, ఫిరాయింపులు, పార్టీ విలీనం వంటి అంశాలు ఉన్నాయి. ఇవి రాజ్యాంలోని కీలక విషయాల్ని లేవనెత్తుతున్నాయని కోర్టు పేర్కొంది.

Best Deals On Laptops : అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లపై 5 బెస్ట్ డీల్స్.. భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!