ED Director SK Mishra: ఈడీ డైరెక్టర్ ఎస్‭కే మిశ్రా పదవీ కాలాన్ని పొడగించిన సుప్రీంకోర్టు

తొలిసారిగా 2018 నవంబర్‌లో ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని రెండేళ్లపాటు పొడిగించారు. ఈ పదవీకాలం నవంబర్ 2020లో ముగిసింది. మే 2020లో అతనికి 60 ఏళ్లు వచ్చాయి. కానీ 2020 నవంబర్ 13న, 2018 ఉత్తర్వును రాష్ట్రపతి సవరించినట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ED Director SK Mishra: ఈడీ డైరెక్టర్ ఎస్‭కే మిశ్రా పదవీ కాలాన్ని పొడగించిన సుప్రీంకోర్టు

Updated On : July 27, 2023 / 5:32 PM IST

Supreme Court: ఈడీ డైరెక్టర్ ఎస్‭కే మిశ్రా(ED Director SK Mishra) పదవీకాలాన్ని(tenure) సెప్టెంబర్ 15 వరకు సుప్రీంకోర్టు(Supreme Court) పొడిగించింది. వాస్తవానికి సంజయ్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ కోర్టు దానిని తిరస్కరించింది. సెప్టెంబర్ 15 వరకు ఈడీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా కొనసాగవచ్చని సుప్రీంకోర్టు గురువారం తేల్చి చెప్పింది.

KTR: గతంలో భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవి.. ఇప్పుడు మాత్రం..: కేటీఆర్

కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. మరికొద్ది రోజుల్లో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) బృందం రాబోతోందని, ఈ జట్టు సమీక్షపై దేశ ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎస్కే మిశ్రా పదవీకాలం పొడిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఎస్కే మిశ్రా పదవీకాలాన్ని పొడిగించింది.

Bijendra Prasad Yadav: బిహార్‭లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు యువకుల మృతి.. దానిని సమర్ధిస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర మంత్రి

అంతకుముందు, జూలై 11న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుత డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని మూడవసారి పొడిగింపు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. సంజయ్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సంజయ్ మిశ్రా జూలై 31 వరకు తన పదవిలో కొనసాగవచ్చని కోర్టు పేర్కొంది.

Twitter Gold Tick : బ్రాండ్ అకౌంట్లకు మస్క్ కొత్త ఫిట్టింగ్.. ట్విట్టర్‌లో యాడ్స్‌పై నెలకు రూ. 81 వేలు ఖర్చు పెడితేనే గోల్డ్ టిక్..!

తొలిసారిగా 2018 నవంబర్‌లో ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని రెండేళ్లపాటు పొడిగించారు. ఈ పదవీకాలం నవంబర్ 2020లో ముగిసింది. మే 2020లో అతనికి 60 ఏళ్లు వచ్చాయి. కానీ 2020 నవంబర్ 13న, 2018 ఉత్తర్వును రాష్ట్రపతి సవరించినట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ కాలాన్ని రెండేళ్ల నుంచి మూడేళ్లకు మార్చారు. దీనిని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సెప్టెంబరు 2021లో తీర్పును సవరించడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది, అయితే మిశ్రాకు తదుపరి పొడిగింపు ఇవ్వకుండా తీర్పు ఇచ్చింది.