సుప్రీం తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం

సుప్రీం తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం

ఢిల్లీలో పాలన అధికారాలకు సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు.కేంద్రప్రభుత్వ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం వెలువరించిన తీర్పు దురదృష్టకరమని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని కేజ్రీవాల్ అన్నారు. ఉన్నతన్యాయస్థానాన్ని గౌరవిస్తామని కానీ ఈ తీర్పు ప్రజలకు అన్యాయం చేసినట్లే అని ఆయన అన్నారు. ఏ విధమైన ప్రజాస్వామ్యం ఇది? ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసు దగ్గరకు బలవంతంగా నిద్రపొవడానికి నెట్టబడి, అభివృద్ధి పనులు చేసేందుకు ఆందోళన చేస్తే  ఢిల్లీ ఏ విధంగా అభివృద్ధి చెందగలదు అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఒక ప్రభుత్వం తన అధికారులను ట్రాన్స్ ఫర్ చేసుకోలేకపోతే ఏ విధంగా పని జరగాల్సి ఉంటుందని ప్రశ్నించారు. తమ ఆఫీసర్లనే ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ కూడా చేసుకోలేకుంటే ఏ విధంగా ప్రభుత్వనిర్వహణ కొనసాగుతుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
67 సీట్లు గెలిచిన తమ పార్టీకి ఎటువంటి హక్కులు లేవు కానీ 3 సీట్లు గెలిచిన పార్టీకి ఆ హక్కులు ఉన్నాయంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నారు. తమ ఆఫీసర్లనే ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ కూడా చేసుకోలేకుంటే ఏ విధంగా ప్రభుత్వనిర్వహణ కొనసాగుతుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. సుప్రీం తీర్పుపై కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు.

యాంటీ కరప్షన్ బ్రాంచ్(ACB), ఎలక్ట్రిసిటీ బోర్టులపై నియంత్రణ, ల్యాండ్ రెవెన్యూ విషయాలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను నియమించడం వంటి  అధికారాల  కోసం ప్రయత్నించిన ఆప్ ప్రభుత్వానికి సుప్రీం తీర్పు షాక్ ఇచ్చింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి కేసుల్లో ఢిల్లీ ప్రభుత్వం ఏసీబీ ద్వారా దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని  జస్టిస్  ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం గురువారం తీర్పు వెలువరించింది. కేవలం కేంద్రప్రభుత్వానికి మాత్రమే విచారణ కమిషన్ ఏర్పాటు చేయడానికి అధికారం ఉందని కోర్టు తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ కి ప్రత్యామ్నాయంగా ఢిల్లీ ప్ురభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, లా ఆఫీసర్లను నియమించుకునే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు తెలిపింది.