సుశాంత్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ : రియా చక్రవర్తిపై FIR ఫైల్ చేసిన హీరో తండ్రి

  • Published By: madhu ,Published On : July 29, 2020 / 07:40 AM IST
సుశాంత్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ : రియా చక్రవర్తిపై FIR ఫైల్ చేసిన హీరో తండ్రి

Updated On : July 29, 2020 / 10:34 AM IST

బాలీవుడ్ వర్ధమాన హీరో సుశాంత్ రాజ్ పుత్ సింగ్..ఆత్మహత్య కేసులో మరో సంచలాత్మక ట్విస్టు చోటు చేసుకుంది. హీరో తండ్రి కేకే సింగ్ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు. అసలు సుశాంత్ ఆత్మహత్య కేసులో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ ఇంక కంటిన్యూ అవుతోంది.



సుశాంత్ ఆత్మహత్యకు రియా సాయం చేసిందని, తన కొడుకు చనిపోవడానికి కారణం రియానే కారణమని ఫిర్యాదు చేసినట్లు పాట్నా సెంట్ర్ జోన్ ఇన్స్ పెక్టర్ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తిగా రియా చూసుకుందని, సుశాంత్ ఆత్మహత్యకు 6 రోజుల డబ్బు, నగలతో ప్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని కేకే సింగ్ ఫిర్యాదులో వెల్లడించారు.

సుశాంత్ కు సంబంధించిన క్రెడిట్ కార్డు సైతం రియా దగ్గరనే ఉందన్నారు. ఫిర్యాదు ప్రకారం..దర్యాప్తు చేయడానికి నలుగురు టీం ముంబైకి పంపించామని, పలు సెక్షన్ల కింద రియాపై కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు.



ఇదిలా ఉంటే..ప్రముఖ జర్నలిస్టు మార్యా షకీల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఏడాది కాలంలోనే 15 కోట్ల డబ్బు రియా అకౌంట్ కు వెళ్లాయని, సుశాంత్ క్రెడిట్ కార్డులు, నగలు అన్ని రియా తీసుకుందని తెలిపారు.





ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివాసం ఉంటున్న సుశాంత్ సింగ్ 2020, జూన్ 14వ తేదీన విగతజీవుడిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని విచారించారు. అందులో రియా కూడ ఉన్నారు. సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించాలనే డిమాండ్స్ వినిపించాయి.

1986 జనవరి 21వ తేదీన సుశాంత్ జన్మించారు. సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై కనిపించారు. కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టివి సీరియల్స్ లో నటించారు. జీటీవీలో వచ్చిన పవిత్ర రిస్తా సీరియల్ తో మంచి గుర్తింపు పొందారు. 2013 లో కైపోచేతో సుశాంత్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇందులో మంచి నటన కనబరిచినందుకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.