Bansuri Swaraj : తొలిసారి ఎన్నికల బరిలో సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్.. బీజేపీ తొలి జాబితాలో చోటు!
Bansuri Swaraj : భారతీయ జనతా పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. అందులో దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.

Sushma Swaraj's Daughter, Bansuri Swaraj, To Make Her Poll Debut
Bansuri Swaraj : దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె, సుప్రీంకోర్టు న్యాయవాది బాన్సురి స్వరాజ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అరంగేట్రం చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ తన తొలి అభ్యర్థుల జాబితాలో స్వరాజ్ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. తొలి జాబితాలో తన పేరు ప్రకటించిన వెంటనే బాన్సురి స్వరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.
Read Also : BJP First List : బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఆ 8 సీట్లు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి?
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు మా అమ్మ (సుష్మా స్వరాజ్) ఆశీస్సులు ఉన్నాయని నాకు తెలుసు. అయితే ఈ ఘనత బన్సూరి స్వరాజ్‌ది కాదు.. ఢిల్లీ బీజేపీకి చెందిన ప్రతి కార్యకర్తది’ అని స్వరాజ్ పేర్కొన్నారు. బాన్సురి స్వరాజ్ ఎన్నికల బరిలో దిగడం ఇదే మొదటిసారి. టికెట్ కేటాయించిన బీజేపీ అధిష్ఠానానికి బాన్సురి కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్ల బాన్సురి స్వరాజ్‌ను బీజేపీ ఢిల్లీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా నియమించింది.
బాన్సురి స్వరాజ్ న్యాయవాద వృత్తిలో పదిహేనేళ్ల అనుభవాన్ని కలిగి ఉన్నారు. 2007లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో చేరారు. యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన బీపీపీ లాలో లా డిగ్రీని అభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని సెయింట్ కేథరీన్ కాలేజీ నుంచి తన మాస్టర్స్ ఆఫ్ స్టడీస్‌ను పూర్తి చేశారు.
#WATCH | BJP fields former External Affairs Minister late Sushma Swaraj’s daughter, Bansuri Swaraj from New Delhi seat, she says, “I feel grateful. I express gratitude towards PM Modi, HM Amit Shah ji, JP Nadda ji and every BJP worker for giving me this opportunity. With the… pic.twitter.com/szfg055rzf
— ANI (@ANI) March 2, 2024
గతంలో బాన్సురి హర్యానా రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బీజేపీ ఎన్నికల తేదీలు ప్రకటించకముందే 195 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మూడోసారి వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేయనున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి హోంమంత్రి అమిత్ షా మళ్లీ బరిలోకి దిగనున్నారు.
Read Also : BJP Strategy On Alliance : టీడీపీ-జనసేన కూటమితో పొత్తు.. బీజేపీ వ్యూహం ఏమిటి?