BJP First List : బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఆ 8 సీట్లు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి?

తొలి జాబితాలో 195 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు.

BJP First List : బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఆ 8 సీట్లు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి?

Debate On BJP First List

BJP First List : రానున్న లోక్ సభ ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందే అధికారంలో ఉన్న బీజేపీ సిద్ధమైపోయింది. తొలి జాబితాలో 195 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. అందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. అక్కడ కొత్త అభ్యర్థి వస్తారా? లేదా బాపూరావునే రెండో జాబితాలో ఖరారు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. సోయం బాపూరావు కూడా ఇతర పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలోనే ఇలా జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది.

తెలంగాణలో రెండు స్థానాలు ఆసక్తి రేపుతున్నాయి. అందులో ఒకటి మల్కాజిగిరి. ఈ స్థానానికి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ విద్యాసంస్థల యజమాని కొమరయ్య తీవ్రంగా పోటీపడ్డారు. దీంతో ఈ స్థానాన్ని పెండింగ్ లో పెడతారు అని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా తొలి జాబితాలోనే మల్కాజిగిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ప్రకటించారు. ఇక ఆసక్తిరేపుతున్న మరో స్థానం జహీరాబాద్. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ నిన్ననే బీజేపీలో చేరారు. ఆయనకు టికెట్ వస్తుందా రాదా అని అనుకున్నారు. బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వొద్దని జహీరాబాద్ కు చెందిన కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కోరారు.

అయితే, బీజేపీ హైకమాండ్.. నిన్ననే పార్టీలో చేరిన బీబీ పాటిల్ కు మరో అవకాశం దక్కింది. గతంలో రెండుసార్లు ఆయన బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు భరత్ కు తొలి జాబితాలోనే అవకాశం దక్కింది. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ను భరత్ కు ఇచ్చారు.

Also Read : 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

పూర్తి వివరాలు..