జూన్ 8 లేదా 9న ప్రధానిగా మోదీ, జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం..?

మేమంతా ఐక్యంగా ఉన్నామనే మేసేజ్ ఇచ్చారు. దాంతోపాటు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టత ఇచ్చారు.

జూన్ 8 లేదా 9న ప్రధానిగా మోదీ, జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం..?

Updated On : June 5, 2024 / 7:57 PM IST

Narendra Modi : నరేంద్ర మోదీ ప్రధానిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడు బాధ్యతలు తీసుకోనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, జూన్ 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, జూన్ 12న చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

జూన్ 7న మరోసారి ఎన్డీఏ పక్షాలు సమావేశం కానున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. 7న బీజేపీ పార్లమెంటరీ సమావేశం తర్వాత ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఎన్డీఏ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కావాలని నిర్ణయించారు. ఆరోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని నేతలు కోరనున్నారని తెలుస్తోంది.

కాగా, ఇవాళ నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర పాటు ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరిగింది. దీని ద్వారా మేమంతా ఐక్యంగా ఉన్నామనే మేసేజ్ ఇచ్చారు. దాంతోపాటు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టత ఇచ్చారు. ఇక, ఎన్డీయే నాయకుడిగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు భాగస్వామ్య పక్ష నేతలు. ఈ మేరకు తీర్మానం చేశారు.

Also Read : ఎన్డీయేలో కీలకంగా మారిన చంద్రబాబు..! ఈసారైనా ఏపీ దశ మారబోతోందా?