Swiggy One : స్విగ్గీ కస్టమర్లకు శుభవార్త, అపరిమిత ఉచిత డెలివరీలు, డిస్కౌంట్లు

కస్టమర్లను ఆకట్టుకొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వారికి మరిన్ని సేవలు అందించాలని నిర్ణయించింది. ‘స్విగ్గీ వన్’ అప్ గ్రేడ్ మెంబర్ షిప్ ప్రోగ్రాంతో ముందుకొచ్చింది.

Swiggy One : స్విగ్గీ కస్టమర్లకు శుభవార్త, అపరిమిత ఉచిత డెలివరీలు, డిస్కౌంట్లు

Swiggy

Updated On : November 22, 2021 / 6:24 PM IST

Swiggy One : ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఒకటైన స్విగ్గీ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వారికి మరిన్ని సేవలు అందించాలని నిర్ణయించింది. కస్టమర్లకు ప్రయోజనాలు అందించేందుకు గాను…‘స్విగ్గీ వన్’ అప్ గ్రేడ్ మెంబర్ షిప్ ప్రోగ్రాంతో ముందుకొచ్చింది. మెంబర్ షిప్ తీసుకుంటే…అపరిమిత ఉచిత డెలివరీలు, డిస్కౌంట్లతో పాటు మరిన్ని ప్రయోజనాలు స్విగ్గీ అందించబోతోంది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న స్విగ్గీ సూపర్ ప్లాన్ తో కేవలం పరిమిత సంఖ్యలోనే ఉచిత డెలివరీలను పొందే అవకాశం ఉంది.

Read More : Chandrababu : మూడు రాజధానుల బిల్లు రద్దుపై స్పందించిన చంద్రబాబు

స్విగ్గీ సూపర్ మెంబర్స్ గా ఉన్న వారు..స్విగ్గీ వన్ మెంబర్ షిప్ కు ఎలాంటి ఖర్చ లేకుండా…ఉచితంగానే అప్ గ్రేడ్ అవుతారని సంస్థ తెలిపింది. రూ. 99 కంటే ఎక్కువ గ్రాసరీ ఆర్డర్స్ పై అపరిమిత ఉచిత ఇన్ స్టామార్ట్ డెలివరీలను కూడా అందించనుంది. ఫుడ్ ఆర్డర్స్ పై 30 శాతం వరకు అదనపు తగ్గింపులు పొందవచ్చు.

మెంబర్ షిప్ ధర ఎంత ?

స్విగ్గీ తీసుకొచ్చిన స్విగ్గీ వన్…మూడు నెలలకు రూ. 299, సంవత్సరానికి అయితే..899 చెల్లించి..మెంబర్ షిప్ ను పొందచవచ్చు. అయితే..ఈ సేవలు కేవలం త్రివేండ్రం, విజయవాడ, పూణే, లక్నో నగరాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే దేశ వ్యాప్తంగా 500కు పైగా నగరాలకు స్విగ్గీ వన్ మెంబర్ షిప్ కస్టమర్లకు అందుబాటులో రాబోతుందని సంస్థ తెలిపింది.