Taj Mahal : తాజ్‌మహల్‌ను కమ్మేసిన కాలుష్యం .. వెలవెలబోతున్న ప్రేమ చిహ్నం
ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్ ను కమ్మేసింది. ధవరణ వర్ణంలో మెరిసిపోయే తాజ్ మహల్ కాలుష్య కోరల్లో చిక్కుకుని వెలవెలబోతోంది.

Taj Mahal
Taj Mahal in Agra engulfed in pollution : ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్ ను కమ్మేసింది. ధవరణ వర్ణంలో మెరిసిపోయే తాజ్ మహల్ వెన్నెల్లో ఎంత అందంగా..మనోహరంగా ఉంటుందో..కాలుష్య కోరల్లో చిక్కుకుని వెలవెలబోతోంది. పొగమంచుతో పాటు కాలుష్యంలో చిక్కుకున్న ప్రేమ చిహ్నం మసకబారిపోతోంది. అంతకంతకు తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరొందిన తాజ్ మహల్ కాలుష్య కోరల నుంచి కాపాడేందుకు ఎంతగా యత్నించినా అది యత్నంగానే మిగిలిపోతోంది తప్ప శాశ్వత పరిష్కార మార్గాలు మాత్రం ఏమాత్రం కనిపించటంలేదు.
దీంట్లో భాగంగా ఈ ఏడాది కూడా ఢిల్లీని కాలుష్యం కమ్మేయటంతో ఆ ప్రభావం ఆగ్రాలో కొలువైన ప్రేమ చిహ్నాన్ని కూడా కప్పేస్తోంది. ఫలితంగా తాజ్ మహల్ వెలుగులు అంతకంతకు కోల్పోతోంది. ఢిల్లీ పరిసరాల్లో కాలుష్య నగరంతో పాటు పలు చారిత్రాత్మక కట్టడాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఫలితంగా వాటి ప్రాభావాలను కోల్పోయేలా చేస్తోంది. తాజ్ మహల్ అంటే వాహ్ తాజ్ అంటూ మురిసిపోయే తాజ్ ప్రేమికులు మాత్రం కాలుష్యం కప్పేసినా పొగమంచు కమ్మేసినా దాని అందాన్ని మాత్రం ఆస్వాదిస్తున్నారు. అంతటి పొగమంచులో కూడా పొగమంచు కమ్మేసిన తాజ్ ను ఫోటోలు, వీడియోలు తీస్తు సందడి చేస్తున్నారు. కాలుష్యంలో ఉన్నా..పొగమంచులో ఉన్నా తాజ్ అంటే తాజ్ అంటు సందడి చేస్తున్నారు వీక్షకులు. పొగమంచులో ఉన్న తాజ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
#WATCH | Uttar Pradesh | Taj Mahal in Agra engulfed in a layer of haze today amid the rise in air pollution levels.
(Visuals shot at 10:10 am today) pic.twitter.com/xxvGJh2lAm
— ANI (@ANI) November 5, 2023
ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దమ్ము, ధూళి కణాలతో గాలి నిండిపోయింది. విజబులిటీ అంతకంతకు పడిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 450పైగా నమోదు అవుతోంది. ఈ కాలుష్యం ప్రభావంతో ప్రజలు శ్వాసకోశ,నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Tamil Nadu : ఒంటెద్దు బండిపై మాజీ మంత్రి చక్కర్లు, పాపం మూగజీవం ఏం చేసింది..? అంటూ సెటైర్లు
అంతకంతకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా..ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ఢిల్లీ ప్రభుత్వంతో చేతులు కలిపి పలు హాట్‌స్పాట్‌లలో నీటిని పిచికారీ చేస్తోంది. “కాలుష్యాన్ని అరికట్టేందుకు మొత్తం 12 అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వివరాల ప్రకారం..ఆదివారం (నవంబర్ 5,2023) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 457పైగా నమోదు అయింది.
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రెండేళ్ల క్రితం కన్నాట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పెద్ద స్మోగ్ టవర్ ఆపరేషన్‌ను నిలిపివేసినందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఛైర్మన్ అశ్వనీ కుమార్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శనివారం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ అన్వర్ అలీపై కూడా క్రమశిక్షణా చర్య తీసుకోవాలని రాయ్ కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఢిల్లీలో డిపిసిసి ఆధ్వర్యంలో కన్నాట్ ప్రాంతం, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలోని ఆనంద్ విహార్‌లో రెండు స్మోగ్ టవర్‌లను ఏర్పాటు చేసినట్లు రాయ్ పేర్కొన్నారు.
ప్రేమకు ప్రతిరూప నిలిచిన ఈ అపురూపమైన కట్టడం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అంత గొప్ప కట్టడం ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకుని అంతకంతకు ప్రాభవాన్ని కోల్పోతుండటం విచారించాల్సిన విషయమని పర్యాటకులు వాపోతున్నారు.