పాక్ జలసంధిని ఈది పడేసిన 10ఏళ్ల బుడతడు

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 08:08 AM IST
పాక్ జలసంధిని ఈది పడేసిన 10ఏళ్ల బుడతడు

Updated On : March 29, 2019 / 8:08 AM IST

10 సంవత్సరాల పసి వయసు. ఆడుతు..పాడుతు తిరిగే ప్రాయం. నీరంటే భయపడే వయస్సు కూడా.కానీ 10 సంవత్సరాల బుడతడు ఏకంగా సముద్రంలో 32 కిలోమీటర్ల దూరాన్ని ఈదేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. పాక్  జలసంధిలో శ్రీలంక నుంచి తమిళనాడులోని ధనుష్కోటికి.. ఏకంగా 32 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదేసి సరికొత్త ఫీట్‌ అందుకున్నాడు. 

తమిళనాడులోని థేనీ జిల్లాకు చెందిన  10 సంవత్సరాల జశ్వంత్‌ కు చిన్ననాటి నుంచి ఈత కొట్టడం అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇప్పించారు. అలా అలా స్విమ్మింగ్ లో వండర్స్ క్రియేట్ చేశాడు జశ్వంత్.తాజాగా జశ్వంత్‌తో పాక్ జలసంధిలో శ్రీలంకలోని తలైమనార్ నుంచి ధనుష్కోటికి 32 కిలోమీటర్ల దూరాన్ని పదిగంటల 30 నిమిషాల్లో రీచ్ అయ్యాడు. 

శ్రీలంకలోని తలైమనార్ నుంచి ఉదయం  4గంటలకు బయల్దేరి.. 9 గంటలకు అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్‌కు చేరకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడులోని ధనుష్కోటికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నాడు. ఈత కొట్టే సమయంలో హెల్త్ డ్రింక్స్‌..మంచినీళ్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ క్రమంలో   ధనుష్కోటికి చేరుకున్న జశ్వంత్‌కు తమిళనాడు డీజీపీ శైలేంద్ర, నౌకాదళ అధికారులు ఘనస్వాగతం పలికి అభినందించారు.