MK Stalin : సిటీ బస్సులో సీఎం.. అవాక్కయిన ప్రయాణికులు
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి స్టాలిన్ పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారివద్దకు వెళ్తున్నారు స్టాలిన్.

Mk Stalin
MK Stalin : తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి స్టాలిన్ పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారివద్దకు వెళ్తున్నారు స్టాలిన్. తన మార్క్ నిర్ణయాలతో ప్రజల హృదయాలు గెలుస్తున్నారు. అనేక విషయాల్లో ప్రతిపక్షాన్ని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు స్టాలిన్. ప్రతిపక్ష నేతలను కూడా సొంతపార్టీ నేతల్లానే కలుపుకొని వెళ్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా? లేదా అనే దానిపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రజలవద్దకే వెళ్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని అక్కడే పరిష్కరిస్తున్నారు స్టాలిన్.
చదవండి : MK Stalin: పోలీసులకు సీఎం వరాలు.. 700మంది ఖైదీల విడుదల
ఇక తాజాగా ఆయన చెన్నై నగరంలోని కన్నాగి ప్రాంతంలో ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని తనిఖీ చేసి.. తిరిగి వెళ్లే క్రమంలో తన కాన్వాయ్‌ను ఆపేసి, సిటీ బస్సు ఎక్కారు. బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. బస్సులో సీఎంను చూసి ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మహిళలకు ఉచిత టికెట్లపై ఆరా తీశారు. వాటివల్ల ప్రయోజనం చేకూరుతోందా? అని అడిగారు. అంతేకాదు, ప్రయాణాల్లో విధిగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. ప్రయాణికులు సీఎంతో సెల్ఫీలకు ఉత్సాహం ప్రదర్శించగా ఆయన వారికి సహకరించారు.
చదవండి : MK Stalin : కుటుంబానికి రూ.5వేలు.. సీఎం మరో కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఆర్టీసీ బస్సులో కొంతసేపు ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. @CMOTamilnadu pic.twitter.com/uoAmQLVPu1
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 23, 2021