Tamil Nadu : 27 జిల్లాలో అన్ లాక్, తెరుచుకున్న సెలూన్లు, టీ షాపులు
తమిళనాడులో జిల్లాలో కూడా అన్ లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. 27 జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా..షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. నేటి నుంచి గవర్న మెంట్ ఈ సర్వీసు సెంటర్లు కూడా ప్రారంభం కానున్నాయి.

Tamilnadu
Unlock Process : భారతదేశంలో కరోనా ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అన్ లాక్ ప్రకటించినా..కొన్నింటికి మాత్రమే అనుమతినిస్తున్నారు. తమిళనాడులో జిల్లాలో కూడా అన్ లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. 27 జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా..షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. నేటి నుంచి గవర్న మెంట్ ఈ సర్వీసు సెంటర్లు కూడా ప్రారంభం కానున్నాయి.
నిర్మాణ కంపెనీలు 50 శాతం ఉద్యోగులతో పనిచేసేందుకు అమనుతి కల్పించారు. కోయంబత్తూరు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలు, టీ షాపులు తెరుచుకున్నాయి. టీ షాపుల్లో టేక్ అవే సర్వీసుకు అనుమతినిచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేయనన్నాయి. టీ, కాఫీలాంటి వాటిని తీసుకెళ్లేందుకు సొంతంగా కప్పులు తీసుకరావాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో వెల్లడించింది. ప్లాస్టిక్ వాడకం వాడొద్దన్న ఉద్దేశ్యంతో ఈ సూచన చేశారు. టీ షాపుల వద్ద ఎవరూ టీ తాగొద్దని, స్వీటు షాపుల విషయానికి వస్తే..ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరచుకోవాలని వెల్లడించారు. మిగతా జిల్లాలో మాత్రం లాక్ డౌన్ కఠినంగా ఆంక్షలు అమలు చేయనున్నారు.
Read More : Ashok Gajapathi Raju : సింహాచల ఆలయ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్ గజపతి రాజు