Tamil Nadu : దళిత మహిళ వండిన ఆహారం తినడానికి నిరాకరించిన విద్యార్ధులు.. జిల్లా కలెక్టర్ ఏం చేశారంటే?
దళిత మహిళ వంట చేసిందని తినడానికి ఓ స్కూల్లో విద్యార్ధులు నిరాకరించారు. తమిళనాడులో ఓ స్కూల్లో జరిగిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్కూలుని సందర్శించి విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడారు.

Tamil Nadu
Tamil Nadu : తమిళనాడులోని ఓ పాఠశాలలో దళిత మహిళ తయారు చేసిన భోజనం తినడానికి 15 మంది విద్యార్ధులు నిరాకరించారు. పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కుల వివక్షకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యార్ధుల తల్లిదండ్రులను హెచ్చరించారు.
Police Dragged Woman : మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన.. మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు
తమిళనాడులోని కరూర్ జిల్లా వేలన్ చెట్టియార్ పంచాయతీ యూనియన్ స్కూల్‌లో చదువుతున్న 30 మంది విద్యార్థులలో 15 మంది అల్పాహారం తినడానికి నిరాకరించారు. దళిత మహిళ వండినందుకు వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను జిల్లా యంత్రాంగానికి నివేదించడంతో జిల్లా కలెక్టర్ స్పందించి స్కూలుని సందర్శించారు. ఆ విద్యార్ధుల తల్లిదండ్రులను పిలిపించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్పాహార పథకాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ హిందూ విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. దళితురాలైన సుమతి అనే మహిళ ఆహారాన్ని తయారు చేయడాన్ని ఓ విద్యార్ధి తల్లిదండ్రులు తప్పు పట్టారు. ఆమె వండితే తమ బిడ్డ ఆహారం తినదని చెప్పారు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన..దళితుడికి మలం పూసి…
రాష్ట్రంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో 15.75 లక్షల మంది విద్యార్ధులకు ఉచిత అల్పాహారం అందించే పథకాన్ని ఆగస్టు 25 న ఎంకే స్టాలిన్ ప్రారంభించారు.